నల్గొండలో అనధికారికంగా కొందరు పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా కొట్టి.. గత రెండు రోజులుగా క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, నాలుగు రోజులుగా 60 మందికి పైగా పంచాయతీ సెక్రటరీలు విధులకు గైర్హాజరు అయ్యారు. హాలియాలోని ప్రైవేట్ బీఈడీ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు.