ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి పార్టీల మధ్య కుంపట్లు గట్టిగానే రాజుకుంటున్నాయట. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పెందుర్తిలో పరిణామాలు సెగలు పొగలు కక్కేస్తున్నట్టు చెబుతున్నారు. జనసేన గెలిచిన ఈ స్ధానంలో... సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోందట. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో... పోలీసు, ఇతర కీలక శాఖల పోస్టింగుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు పెద్ద అగాధమే సృష్టించినట్టు చెప్పుకుంటున్నారు.
పంచకర్ల రమేష్ బాబు...! గండి బాబ్జీ...! కూటమి పార్టీల్లో సీనియర్ నేతలు...కేరాఫ్ పెందుర్తి. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మరొకరు మాజీ శాసనసభ్యుడు. ఎన్నికల సమయంలో కలిసి వుంటే కలదు సుఖం అని డ్యూయెట్లు పాడుకున్న ఈ నేతల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ జరుగుతోందని జనసేన, టీడీపీ కేడరే తెగ చెవులు కొరికేసుకుంటోంది.
మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. తాజాగా వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. ఈ నెల 20న పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు చెప్పారు.
వైఎస్సార్‌సీపీ పార్టీకి పంచకర్ల రమేష్ బాబు రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పంచకర్ల రమేష్ బాబు రాజీనామా తొందర పాటు చర్య అని.. ఏ విషయమైనా తనతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు.
ఒకసారి పదవి రుచిచూస్తే.. తేలిగ్గా వదిలి పెట్టలేరు. ఓడినా పైచెయ్యి సాధించాలని చూస్తారు నాయకులు. ఆ జిల్లాలో రాజకీయ నిరుద్యోగులుగా మారిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఆ పనే చేస్తున్నారట. సిట్టింగ్‌ల కుర్చీల కిందకు నీళ్లను తెస్తున్నట్టు టాక్. ఇంతకీ ఎవరా మాజీలు? ఏమా కథా? ఉమ్మడి విశాఖజిల్లాను కంచుకోటగా మలుచుకుంటోంది వైసీపీ. ఇక్కడ అధికారపార్టీకి 12మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. అదేస్ధాయిలో మాజీ ఎమ్మెల్యేల నాయకత్వం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చెయ్యడం ద్వారా…