ఈనెల 20న జనసేన పార్టీ తీర్థం పుచుకోనున్నారు మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈ నెల 20న సాయంత్రం 4.30 గంటలకు పవన్ కల్యాణ్ సమక్షంలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. 400కార్లు, 25బస్సు ల్లో కార్యకర్తలు, అభిమానులతో అమరావతికి ర్యాలీగా వెళతామని ఆయన వెల్లడించారు. పెందుర్తి నుంచే పోటీ చేయాలనేది అభిమానుల కోరిక అని, పార్టీలో చేరిన తర్వాత జనసేన అధినేత నిర్ణయమే ఫైనల్, ఒక కార్యకర్తగా ఎటువంటి బాధ్యత అప్పగించిన చిత్త శుద్ధితో పని చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Also Read : Pawan Kalyan: గెట్ రెడీ ‘బ్రో’… ట్రైలర్ వచ్చేస్తోంది!
రాజకీయ ప్రయోజ నాల కోసం అయితే అధికారపార్టీని వదిలి పెట్టే వాడిని కాదని, వైసీపీ వీడినప్పుడు నేను ఎవరినీ విమర్శలు చేయలేదన్నారు పంచకర్ల. అధికారంలోకి రావడానికి కారణం అయిన కార్యకర్తలను విస్మరించవోద్దని సూచించానని, వైసీపీలో ఉండి ఇతర పార్టీలను తిట్టలేకపోవడం వల్లే బయటకు వచ్చేశానని ఆయన తెలిపారు. ఆత్మాభిమానం దెబ్బతిన్నందుకే పార్టీ మారానట్లు ఆయన వివరించారు. నా అసంతృప్తిని అనేక సార్లు సుబ్బారెడ్డి దృష్టిలో పెట్టానని, భవిష్యత్ లో జనసేనలో చాలా చేరికలు వుండబోతున్నాయని ఆయన వెల్లడించారు. సర్దుబాటులు, ఇతర ఈక్వేషన్లు చేసుకున్న తరువాత పార్టీలోకి ఎవరిని ఆహ్వానించాలో అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారన్నారు.
Also Read : Apple iPhone:ఓల్డ్ ఈజ్ గోల్డ్.. రూ.1.5 కోట్ల ధర పలికిన పాత ఐఫోన్..రికార్డ్ బ్రేక్స్..