ASI Son Gang Case: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఎస్ఐ వెంకట నాయుడు కుమారుడి గ్యాంగ్ కార్ల వ్యవహారంలో మరో కేసు నమోదు అయ్యింది. నర్సరావుపేట చోళ మండలం ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ భరత్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Palnadu: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి కేసులో ప్రధాన నిందితుడు ఏఎస్సై కొడుకు వెంకట నాయుడుపై మరో కేసు నమోదయ్యింది. ఈ నెల 4న నాదెండ్ల మండలం గణపవరం వద్ద నకిలీ బ్రేక్ ఇన్ స్పెక్టర్ అవతారం ఎత్తిన వెంకట నాయుడు తన అనుచరులతో కారులో వచ్చి లారీని ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో లారీని వెనుక వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. అయితే,…
Palnadu Crime: పల్నాడు జిల్లాలో తల్లీకొడుకుల మృతి కలకలం సృష్టిస్తుంది. రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ ఏడు నెలల కొడుకు శరత్ కు అనారోగ్యంగా ఉండడంతో భార్య త్రివేణితో కలిసి నర్సరావుపేట ఆసుపత్రికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో పాలపాడు వద్ద మేజర్ కాల్వ వద్ద బైకు స్కిడ్ అయ్యింది. దీంతో బైకుపై ఉన్న త్రివేణి కొడుకుతో సహా కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోయిన భార్య, కొడుకు కోసం గాలించినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గల్లంతైన…
Murder : బాపట్ల జిల్లాలో తండ్రీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ కేసులో కోర్టుకి హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కొడుకుని కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు…గొంతు కోసి దారుణ హత్య చేశారు. ఈఘటన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కలకలం రేపింది. ఒక్కసారిగా స్థానికులు ఉలికిపాటుకు గురయ్యారు. బాపట్ల జిల్లా సంతమాగులూరుకి చెందిన వీరాస్వామిరెడ్డి గత కొంత కాలంగా బెంగళూరులో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే వీరాస్వామిరెడ్డికి, సంతమాగులూరుకి చెందిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డికి మధ్య…