Wife Harassed By Husband: ప్రేమ పేరుతో ముంచేశాడు.. ఆ మహిళ ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Attempt To Commit Suicide To Seek Justice Against Husband: మొదట ప్రేమన్నాడు.. తర్వాత పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు.. నువ్వు లేకుండా నేను బ్రతకలేనని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి అతని ప్రేమను అంగీకరించింది.. తనని అమితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి.. పెళ్లి చేసుకుంటే జీవితం సుఖమయంగా ఉంటుందని భావించింది. కానీ.. పెళ్లయ్యాక ఆమె ఆశలు నీరుగారిపోయాయి. అంతకుముందే అతనికి మరో మహిళతో వివాహైన సంగతి ఆమెకి తెలిసింది. దాంతో మోసపోయాయని గ్రహించిన ఆ మహిళ.. అతడ్ని నిలదీసింది. అప్పట్నుంచి అతడు ఆమెను చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు. అది భరించలేక, ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
మార్కాపురంకు చెందిన లక్ష్మీ అనే మహిళను కట్టా రమేశ్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, తనని తన భర్త ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సంతోషంగా చూసుకుంటాడని లక్ష్మీ ఆశించింది. కానీ, పెళ్లయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. మొదట్లో కొన్ని రోజుల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత రమేశ్‌కు తనకంటే ముందే మరో మహిళతో వివాహం జరిగిందన్న విషయం లక్ష్మీకి తెలిసింది. అది జీర్ణించుకోలేకపోయిన లక్ష్మీ.. తనని ఎందుకు మోసం చేశావంటూ రమేశ్‌ని నిలదీసింది. అప్పట్నుంచి ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. తాను చెప్పినట్టు పడుండాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ.. రమేశ్ ఆమెను రోజు చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టాడు.
Also Read
- Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
అతని వేధింపులు భరించలేకపోయిన లక్ష్మీ.. తన భర్త నుంచి కాపాడాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే.. ఆ పోలీసులు కూడా అతనితో చేతులు కలిపి తనని వేధిస్తున్నారని లక్ష్మీ ఆరోపిస్తోంది. రక్షకులే ఆ రాక్షసుడితో చేతులు కలపడంతో.. తనకు న్యాయం జరగదన్న ఆవేదనతో లక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తద్వారా ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
-
Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..