ఆదివారం సాయంత్రం పటాన్‌చెరువులో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. రూ. 8.30 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. రూ. 3.40 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ బిల్డింగ్‌తో పాటు రూ. 3.85 కోట్లతో ఆధునీకరించిన మైత్రి క్రీడా మైదానాన్ని.. అలాగే రూ. 1.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏడున్నర కోట్లతో పటాన్‌చెరువు స్టేడియం నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి 15 రోజుల పాటు జరగనున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 4 విడతలుగా జరిగిన ఈ కార్యక్రమంలో పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్ర, పచ్చదనంతో వెల్లివిరిసేలా చేసేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా ఐదో విడతలో భాగంగా తొలి రోజు గ్రామ సభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళిక తయారు చేయాలి. పంచాయతీల ఆదాయ వ్యయాలు, నాలుగు విడతల్లో సాధించిన ఫలితాలను నివేదిక రూపంలో…