Israel-Hamas War: “హీరోగా మరణించాడు”..12 మంది సైనికులను రక్షించి ప్రాణత్యాగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాద దాడిని, ఎంత పాశవికంగా ప్రజల్ని, ముఖ్యంగా చిన్న పిల్లల్ని హతమార్చిందనే వివరాలను ఇజ్రాయిల్ ప్రపంచానికి తెలియజేస్తోంది. మెరుపుదాడిలో అనేక మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. హమాస్ దాడిలో చనిపోయిన వారి సంఖ్య 1200కు చేరుకుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని అత్యంత అమానుషంగా చంపిన విధానం అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.
ఇదిలా ఉంటే తన తోటి సైనికులను కాపాడుకునేందుకు ఓ సైనికుడు చేసిన త్యాగం వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల ఇజ్రాయిల్ సైనికుడు, స్టాఫ్ సార్జంట్ రోయ్ వీజర్ తన ప్రాణాన్ని త్యాగం చేసి 12 మంది తోటి సైనికులను కాపాడారు. హీరోగా మరణించాడు. శనివారం కెరెమ్ షాలోమ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఉగ్రవాదులు గోలానీ బ్రిగేడ్ లోని 13వ బెటాలియన్ సైనికులపై కాల్పులు చేయడం ప్రారంభించారు. కాగా ఉగ్రవాదులను తనవైపు మళ్లించి తోటి సైనికులను పారిపోయేలా చేసేందుకు తనను తాను త్యాగం చేసుకున్నాడని అతని తల్లి నవోమి ఫీఫెర్ వీజర్ వెల్లడించారు.
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
Read Also: IND vs PAK: ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై ఇండియాదే పైచేయి.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో భారత్ జోరు
ఇతరులే ముందు అని అతను జీవించాడని, ఉగ్రవాదుల దృష్టిని మళ్లించడానికి తనంటతాను ప్రాణాలర్పించాడని, అతని ధైర్యసాహసాలే 12 మంది సైనికులు సజీవంగా ఉండేందుకు కారణమయ్యాయని ఆమె అన్నారు. రాయ్ తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించాడు, అతన ఎల్లప్పుడూ తన చుట్టూ ఉన్న వారికి సాయపడేవాడని తెలిపింది. అతన హీరోగా జీవించాడు, హీరోగా మరణించాడని దు:ఖాన్ని దిగమింగుకుంది.
ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) నుంచి తమకు రాయ్ చనిపోయాడని సమాచారం వచ్చిందని , కానీ ఇప్పటి వరకు అతనికి అంత్యక్రియలు చేసేందుకు ఇంకా మృతదేహాన్ని పొందలేకపోయామని నవోమి ఫీఫెర్ వీజర్ తండ్రి ఫేస్‌బుక్ లో భావోద్వేగ పోస్టు పెట్టాడు. మంగళవారం సాయంత్రం ఐడీఎఫ్ రాయ్ మృతదేహాన్ని గుర్తించాయి. రోయ్ తల్లిదండ్రులు యూఎస్ లో పుట్టిపెరిగినప్పటికీ, ఇప్పుడు ఇజ్రాయిల్ లోనే ఉంటున్నారు.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..