దాదాపు 2 కోట్ల మంది తమ మొబైల్ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇక లాభం లేదని.. హాట్ స్టార్, ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులను ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాక్ బౌలర్లను ఉద్దేశించి.. ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పేసర్ల భరతం పడతాడని అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అది ఫేక్ న్యూస్ అని తేలింది.
హ్మదాబాద్ లోని ప్రముఖ హోటళ్లు గదుల అద్దెలను ఒక్కసారిగా పెంచేశాయి. ఒక రోజుకు రూమ్ రెంట్ రూ.లక్షకు చేరింది. హోటల్ బుకింగ్ ల సైట్లు పరిశీలిస్తే.. ఈ విషయం తెలుస్తుంది.
రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన అంజు అనే వివాహిత ఆన్ లైన్లో పాకిస్తాన్ యువకుడితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే అంజుకు సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. నస్రుల్లాతో పెళ్లి తర్వాత అంజుకి ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు.
పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్, తన ప్రేమికుడు సచిన్‌లను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (యూపీ ఏటీఎస్) వరుసగా మూడో రోజు విచారించింది. సీమాతో సచిన్ ఎలా స్నేహం చేశాడు.. ఆమె నేపాల్ ద్వారా అక్రమంగా భారత్‌కు ఎలా చేరుకుంది అని యూపీ ఏటీఎస్ ప్రెస్ నోట్ ఇచ్చింది.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ బుట్టో సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా, వీరి వ్యాఖ్యలపై ఇమ్రాన్ స్పందిస్తూ ‘‘వాళ్లు మా పార్టీని రద్దు చేస్తే చేయనీయండి. కొత్త పార్టీ పేరు మీద గెలుస్తాం అని అన్నారు. పోటీ చేయకుండా నాపై నిషేధం విధించినా, నన్ను జైల్లో వేసినా, మా పార్టీ గెలుస్తుందని ఇమ్రాన్ తెలిపారు.
అయితే పాకిస్తాన్ లో ఆడే ఓ ఆట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏ ఆట అనుకుంటున్నారా..? అక్కడ ఆ ఆటను స్లాప్ కబడ్డీగా పిలుస్తారు. వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ ఆటను చూస్తే.. నవ్వుకోకుండా ఉండలేరు. కామన్ గా కబడ్డీలో ఏడుగురు ఉంటారు. కానీ ఈ ఆట ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది. ఒక ఆటగాడు మరొక ఆటగాడిని కొట్టడం ద్వారా పాయింట్‌ను స్కోరు చేస్తాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా తహసీల్ ఆమ్లాలో ఆదివారం ఎన్‌ఐఏ దాడులు కలకలం సృష్టించాయి. ముంబైలో పనిచేస్తున్న ఓ పెయింటర్ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. పెయింటర్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులతో కలిసి ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది. పెయింటర్ తౌహీద్‌కు పాకిస్థాన్ యువకుడితో సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
చైనాను దృష్టిలో పెట్టుకొని.. సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే అత్యాధునిక అణు వార్‌హెడ్లను భారత్ సమకూర్చుకుంటున్నదని స్వీ డన్‌కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్‌హోం ఇం టర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) తాజాగా వెల్లడించింది.