India approves 120 Pralay missiles for armed forces along China border: సరిహద్దుల్లో ఉద్రికత్త నేపథ్యంలో భారత్ హై అలర్ట్ అవుతుంది. ముఖ్యంగా చైనా సరిహద్దులను మరింత సురక్షితంగా మార్చేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది భారత మిలటరీ. తాజాగా భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి సాయుధ దళాల కోసం 120 ప్రళయ్ క్షిపణులను ఏర్పాటు చేయబోతోంది.
China and Pakistan are planning to attack India together, Says Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు ఇప్పుడు పాకిస్తాన్, చైనా ఇద్దరు శత్రువులు ఉన్నారని ఆయన అన్నారు. భారత్ పై దాడికి ప్లాన్ చేస్తున్నాయని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మాజీ సైనికులతో సంభాషిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దాడి జరిగితే..ఇరు వర్గాలు నష్టపోతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత…
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీని సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26 నుంచి న్యూజిల్యాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ నుంచి కొత్త సెలెక్షన్ కమిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని పీసీబీ ప్రకటించింది. ఇటీవల స్వదేశంలో జరిగిన రెండు టెస్టు సిరీసులను పాకిస్తాన్ ఓడిపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో వైట్ వాష్‌కు గురైంది. ఇంగ్లండ్ చేతిలో వరుస…
Suicide blast in Pakistan's Islamabad: దాయాది దేశం పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని ఇస్లామాబాద్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇస్లామాబాద్ లోని అత్యంత కట్టుదిట్టమైన, దేశ పార్లమెంట్, ఉన్నతాధికారుల కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు వెళ్లే దారిలో ఈ ఘటనల జరగడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. పేలుడు సంభవించిన వెంటనే ఉగ్రవాద వ్యతిరేక దళం ఘటనాస్థలానికి చేరుకుంది. ఈ పేలుడులో ఒక హెడ్ కానిస్టేబుల్ మరణించగా.. నలుగురు పోలీసులు గాయపడ్డారు. మరణించిన పోలీస్…
104 YouTube Channels Blocked For Threatening National Security: జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటట్లు ప్రేరేపిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి యూట్యూబ్ ఛానెళ్లపై బ్యాన్ విధించింది కేంద్రం. తాజాగా 104 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నందుకే వీటిని బ్యాన్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అశాంతిని రేపేలా ఈ యూట్యూబ్ ఛానెళ్లు పనిచేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
వారాంతంలో పాకిస్తాన్ పోలీసు స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్న 33 మంది అనుమానిత ఉగ్రవాద ఖైదీలు మంగళవారం ప్రత్యేక దళాల క్లియరెన్స్ ఆపరేషన్‌లో మరణించారని, వారి బందీలను విడిపించారని రక్షణ మంత్రి తెలిపారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)తో సహా వివిధ తీవ్రవాద గ్రూపులకు చెందిన వారిగా అనుమానించబడిన ఉగ్రవాద ఖైదీలు ఆదివారం నాడు వారి జైలర్లను అధిగమించి ఆయుధాలను లాక్కున్నారు
పాకిస్థాన్‌కు సొంతగడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 0-3 తేడాతో పాకిస్థాన్ కోల్పోయింది. మంగళవారం ముగిసిన మూడో టెస్టులో పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 28.1 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. బెన్ డక్కెట్(78 బంతుల్లో 12 ఫోర్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్(35…
Wanted To Improve Strained Ties With India During My Tenure, says imran khan: తన హయాంలో భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను కోరుకున్నానని, అయితే కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం అడ్డంకిగా మారిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అన్నారు. అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా కూడా భారత్ తో మెరుగైన సంబంధాలకు మొగ్గు చూపారని అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, జమ్మూ కాశ్మీర్…
కిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడిలో నలుగురు పాకిస్తాన్ పోలీసులు మరణించారు. చాలా మంది ఈ దాడిలో గాయపడ్డారు.
Imran Khan Calls For Fresh Polls In Pakistan: పాకిస్తాన్ తో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయి.. షహజాబ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆజాదీ మార్చ్ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాడు.