ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్‌లు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం పెను దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాకిస్థాన్ ఆటగాళ్లతో సహా మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా దాయాది దేశాలు గ్రూప్-4లో తలపడగా.. పలుసార్లు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పాక్ సీనియర్ పేసర్ హారిస్ రవూఫ్ ఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ పేసర్ హారిస్…