Trump: ట్రంప్ నోట మళ్లీ అదే మాట.. నేను అడ్డుకోకపోతే భారత్-పాక్ యుద్ధంలో ఉండేవి
- ట్రంప్ నోట మళ్లీ అదే మాట
- నేను అడ్డుకోకపోతే భారత్-పాక్ యుద్ధంలో ఉండేవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని మళ్లీ ట్రంప్ ప్రకటించారు. స్కాట్లాండ్‌లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని లేవనెత్తారు. తన జోక్యంతోనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిందని.. లేదంటే ఇప్పటికీ రెండు దేశాలు యుద్ధాలు చేసుకునేవని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే సోమవారం పార్లమెంట్ వేదికగా ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కేంద్ర పెద్దలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యాన్ని తోసిపుచ్చాయి. మూడోవ్యక్తి ప్రమేయం లేదని.. ఇరుదేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగిందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. కానీ తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. తానే యుద్ధాన్ని ఆపినట్లుగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను ఆపివేసినట్లు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: S Jaishankar: ఆపరేషన్ సిందూర్‌కు ముందు ఏం జరిగిందంటే..!
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
‘‘భారత్-పాకిస్థాన్ ఘర్షణ చాలా పెద్దది. రెండు దేశాలు అణ్వస్త్ర దేశాలు. అణ్వాయుధాలు ప్రయోగించుకుంటే దారుణ పరిస్థితులు నెలకొనేవి. ఇరుదేశాల నేతలు నాకు బాగా తెలుసు. యుద్ధం చేసుకోవాలనుకుంటే.. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని చెప్పాను. బెదిరించడంతోనే కాల్పుల విరమణ చేసుకున్నాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశం-పాకిస్థాన్ మధ్య సహా ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను నిరోధించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahadev Operation: ఉగ్రవాదుల్ని సైన్యం ఎలా మట్టుబెట్టింది.. మహదేవ్ ఆపరేషన్ సీక్రెట్ ఇదే!
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మతం పేరుతో 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. భార్య, పిల్లల ఎదుటే భర్తలను చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం భారత ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. వంద మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేసింది. ఇక పహల్గామ్ ఉగ్రవాదుల కోసం సైన్యం ఎప్పటి నుంచి వేటాడుతోంది. అనూహ్యంగా సోమవారం పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ఉగ్రవాదుల్ని ఆశ్చర్యంగా సైన్యం హతమార్చింది.
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!