పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగుతుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ 152 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఎట్టకేలకు సొంతగడ్డపై టెస్టు విజయాన్ని రుచి చూసింది. 1349 రోజుల తర్వాత సొంతగడ్డపై పాకిస్థాన్‌కు ఇదే తొలి టెస్టు విజయం. పాకిస్థాన్ తరఫున ఈ టెస్టు మ్యాచ్‌లో ఇద్దరు స్పి్న్నర్లు రెచ్చిపోయారు. నౌమన్ అలీ 11, సాజిద్ ఖాన్ 9 వికెట్లతో మొత్తం 20…
Pakistan Win against England in Multan: పాకిస్థాన్ క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సొంతగడ్డపై ఎట్టకేలకు టెస్టు విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. దాంతో 1338 రోజుల నిరీక్షణకు తెరపడింది. స్వదేశంలో 11 మ్యాచుల అనంతరం తొలి గెలుపు దక్కడంతో పాక్ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరగా పాక్ స్వదేశంలో…
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో పేలవ ప్రదర్శన చేసిన బాబర్ అజామ్, షహీన్ అఫ్రీది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లపై వేటు పడింది. ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్ట్‌ల కోసం పీసీబీ ప్రకటించిన జట్టులో వీరికి చోటు దక్కలేదు. పీసీబీ నిర్ణయంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ తాజాగా స్పందించాడు. బాసిత్…
పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఇవాళ ప్రారంభమైన మొదటి టెస్టులో ఇంగ్లీష్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టు మ్యాచ్ తొలిరోజే 500 పరుగులు చేసిన మొదటి జట్టుగా రికార్టు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి రోజే 4 వికెట్లు కోల్పోయి 506 పరుగుల స్కోర్ చేసి, క్రికెట్ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది.
T20 World Cup Final 2022: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా ఇంగ్లాండ్ నిలిచింది. రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. సునాయాసమైన 138 పరుగుల టార్గెట్ ను ఆడుతూపాడుతూ అందుకుంది. 19 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 138 పరుగులును ఛేదించింది. ప్రపంచకప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు నిరాశే ఎదురైంది. బెన్ స్టోక్స్ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగడంతో మరో ఓవర్ ఉండగానే ఇంగ్లాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన…
T20 World Cup Final 2022: ఆస్ట్రేలియా మెల్బోర్న్ వేదికగా జరగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ తక్కువ సోరుకే పరిమితం అయింది. ఇంగ్లాండ్ బౌలింగ్ ధాటికి పాకిస్తాన్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఇంగ్లాండ్ ముందు 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
సంచలన ప్రదర్శనలతో ఆసక్తికరంగా సాగిన 2022 టీ20 ప్రపంచకప్ తుదిపోరుకు ఆసన్నమైంది. టీ20 కొత్త ప్రపంచ ఛాంపియన్ ఎవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.