భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే.. హోరాహోరీ పోరు, ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. దుబాయ్ స్టేడియంలో పాక్ అభిమానుల సందడి కాసేపు కనిపించినా.. ఆ తర్వాత అది కూడా కనిపించకుండా పోయింది. పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కారణంగా ఫాన్స్ నిరాశలో కనిపించారు. భారత్ చేతిలో ఓటమి అనంతరం…