Chicken Prices At Historic High Across Pakistan: అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. చికెన్ ధర ఆకాశాన్నంటింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. కిలో రూ.720కి చికెన్ ధర పెరిగింది. అయితే.. ఇది మన దేశంలో కాదులెండి, పొరుగు దేశం పాకిస్తాన్‌లో. కరాచీలో కేజీ చికెన్ ధర రూ.720 ఉండగా.. ఇస్లామాబాద్, రావల్పిండి సహా ఇతర నగరాల్లో రూ.700-705 మధ్యలో ఉంది. అయితే.. లాహోర్‌లో మాత్రం రూ.550-600 మధ్య రేటు పలుకుతోంది. ఇంతలా అక్కడ చికెన్ రేట్లు పెరగడానికి కారణం.. ఆర్థిక సంక్షోభంతో పాటు పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడటమేని పాకిస్తాన్ మీడియా తెలుపుతోంది. కోళ్ల ఫీడ్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని, అందుకే పౌల్ట్రీ వ్యాపారులు బిజినెస్ నిలిపివేశారని పేర్కొంటోంది. చరిత్రలో కనీవినీ ఎరుగుని స్థాయిలో పెరిగిన ఈ ధరలు చూసి.. చికెన్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరగడంతో.. చికెన్‌ను తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Maha Shivaratri Stotram: ఈ స్తోత్రాలు వింటే పునర్జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం రంగంలోకి దిగి.. ఈ చికెన్ ధరల సమస్యను పరిష్కించేందుకు ప్రయత్నిస్తోంది. కోళ్లకు అందించే ఫీడ్‌కు కొరత ఎందుకు ఏర్పడిందనే విషయంపై విచారణ చేపట్టింది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించి, చికెన్ ధరల్ని తగ్గించి, ప్రజలకు ఊరటనిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాగా.. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో పౌల్ట్రీ పరిశ్రమ ఎంతో ముఖ్యమైంది. దాని సరఫరా గొలుసుకు అంతరాయాలు ఏర్పడితే.. దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పాక్ మీడియం చెప్తోంది. అందుకే, ఈ అంశంపై పాక్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కేవలం పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడటమే కాదు.. పాక్‌లో పెట్రోల్ కొరత కూడా ఏర్పడింది. చాలాచోట్ల పంపుల్లో పెట్రోల్ అయిపోయింది. దీంతో.. ప్రజల జీవితానికి అంతరాయం ఏర్పడింది. నెల రోజులకు పైగా పంపులకు సరఫరా లేకపోవడంతో.. సుదూర ప్రాంతాల్లో పరిస్థితి భయంకరంగా ఉందని పాక్‌లోని డాన్ పత్రిక నివేదించింది. పేలవమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా పంజాబ్‌లోని ప్రధాన, చిన్న నగరాల్లోని అనేక పెట్రోల్ పంపులు మూసివేయబడ్డాయని డాన్ పేర్కొంది.
Cyprus President: సైప్రస్ తదుపరి అధ్యక్షుడిగా నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఎన్నిక
మరోవైపు.. ఐఎంఎఫ్ బెయిలౌట్ సాయంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడొచ్చని భావించిన పాకిస్తాన్‌కి ఊహించని షాక్ తగిలింది. ఐఎంఎఫ్‌తో గత పది రోజుల నుంచి పాక్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు.. విఫలం అయినట్లు అక్కడి మీడియా చెబుతోంది. బెయిలౌట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో ఒప్పందం చేసుకోవడంలో పాకిస్తాన్ విఫలం అయినట్లు తెలుస్తోంది. దీనిపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఊహకు అందని విధంగా ఐఎంఎఫ్ షరతులు ఉన్నాయని, కానీ పాకిస్తాన్ వీటికి తలొగ్గాల్సిందేనని పేర్కొన్నారు. అయితే.. ఐఎంఎఫ్ షరతులకు అంగీకరిస్తే అక్కడి ప్రజలు మరింతగా సమస్యల్లో కూరుకుపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యుత్ టారిఫ్ పెంచడం, పెట్రోల్ ధరలు పెంచడం, సబ్సిడీలను ఎత్తేయడం, పన్నులను పెంచడం వంటి షరతులను ఐఎంఎఫ్ విధిస్తోంది.
Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. ఇప్పటికే 34 వేలు దాటిన మృతుల సంఖ్య