Raja Riyaz Ahmad Khan Says Imran Khan Should Have Been Hanged Publicly: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పబ్లిక్‌లో ఉరి తీయాలని ప్రతిపక్ష నేత రాజా రియాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జడ్జీలు ఆయన్ను అల్లుడిలా ట్రీట్ చేస్తున్నారంటూ, బెయిల్ మంజూరు చేసిన వారిపై ధ్వజమెత్తారు. ఈ యూదుల ఏజెంట్ జడ్జీలకు అంతగా నచ్చితే.. వాళ్లందరూ వెళ్లి పీటీఐ పార్టీలో చేరాలని సెటైర్లు వేశారు. పీటీఐ పార్టీలో ఆ జడ్జీల కోసం కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని, వారు ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని పేర్కొన్నారు. ఆ జడ్జీల స్థానంలో పేదలకు న్యాయం చేసే న్యాయమూర్తుల్ని తీసుకురావాలని కోరారు. పార్లమెంట్ సాక్షిగా రియాజ్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు ఇమ్రాన్ శిక్షణ ఇచ్చారని, ఆయనొక యూధుల ఏజెంట్ అని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆ ఉగ్రవాదులే పాక్ పోలీసులపై పెట్రోల్ బాంబులు విసిరారని, కమాండర్ జిన్నా ఇంటిని కూడా తగలబెట్టారని రియాజ్ అహ్మద్ మండిపడ్డారు. అలాగే.. పీటీఐ మద్దతుదారులు పాకిస్థాన్‌లో సృష్టిస్తున్న విధ్వంసం వల్ల దేశం సిగ్గుపడుతోందన్నారు.
Anasuya Bharadwaj: ఏంటి ఆంటీ కుర్రాళ్లను ఇంతలా రెచ్చగొడుతున్నావ్..
ఇదిలావుండగా.. ఆల్ ఖరీద్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అవ్వడం, బెయిల్‌పై విడుదల అవ్వడం తెలిసిందే! అలాగే.. తోషాఖానా కేసులోనూ క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కూడా ఇస్లామాబాద్ హైకోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడంపై ఆయన మద్దతుదారులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఆస్తులతో పాటు భవనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు మరణించారు. కొందరిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన ఇమ్రాన్ ఖాన్.. ప్రజలందరూ శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే.. పీటీఐ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హింసకు పాల్పడింది ఎవరో నిర్ధారించుకోకుండా.. పీటీఐ శ్రేణలపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపణలు చేశారు.
Wrestlers Protest: తాకితే అపార్థం చేసుకుంటారా.. రుజువులున్నాయా?