Pakistan: పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతున్నారు పాక్ తాలిబాన్లు. తాజాగా మరోసారి పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ ఘటన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఖైబర్ జిల్లాలో జరిగింది. తిరా ప్రాంతంలోని హైదర్ కందావో సైనిక పోస్టుపై దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఇత్తిహాదుల్ ముజాహిదీన్ పాకిస్తాన్‌తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులు దాడికి పాల్పడినట్లు ప్రకటించాయి.
Lashkar-e-Taiba: ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. సింధు జల ఒప్పందం నిలిపేయడం ద్వారా భారత్ పాకిస్తాన్లో వరదలకు కారణమైందని నిందించాడు. ప్రధాని మోడీకి గుణపాఠం చెప్పే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అభ్యర్థిస్తామని వీడియో సందేశంలో కసూరీ చెప్పాడు.
India-Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తా్న్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ సమయంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విమరణకు బ్రతిమిలాడటంతో, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ భారత్‌పై విషం కక్కుతూనే ఉంది. ఇప్పటికే, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ భారతదేశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు, ముస్లింలు వేరు అంటూ, కాశ్మీర్ తన జీవనాడి అంటూ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని రోజులకు, పమల్గామ్లో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు, ఆసిమ్ మునీర్ దారిలోనే పాక్ ఆర్మీ అధికారులు నడుస్తున్నారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ దేశ ఆర్మీపై భీకర దాడులు చేసింది. ముందుగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది.
Pakistan: అల్ ఖైదా అధినేత, అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను యూఎస్ బలగాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో హతమార్చాయి. 2001 సెప్టెంబర్ 11 దాడులు జరిగిన దాదాపు 10 ఏళ్ల తర్వాత లాడెన్ జాడను కనిపెట్టి, 2011 మే 2న యూఎస్‌కు చెందిన నేవీ సీల్స్ దాదాపు 40 నిమిషాల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, హతం చేశాయి.
Pakistan Balochistan Operation: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గత రెండు రోజుల్లో పాకిస్థాన్ భద్రతా దళాలు కనీసం 47 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నాయి. పాకిస్థాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ (ISPR) శనివారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఆగస్టు 7 – 8 మధ్య రాత్రి జోబ్ జిల్లాలోని సంబాజా ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 33 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నాయి. ఆగస్టు 8 – 9 రాత్రి ఆఫ్ఘనిస్థాన్…
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కన్నా ఎక్కువగా విదేశాల పర్యటిస్తున్నారు. తాజాగా, ఆయన చైనా పర్యటనకు వెళ్లారు. అయితే, మునీర్ తన బీజింగ్ పర్యటనలో చైనా చేతిలో చీవాట్లు తిన్నట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆసిమ్ మునీర్‌ని నేరుగా మందలించిన పనిచేశారు. పాకిస్తాన్లో చైనా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయుల భద్రత గురించి వాంగ్ యీ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా…
Pakistan: భారత దేశానికి ఏ మాత్రం తీసుపోము, చెప్పాలంటే భారత్ కన్నా మేమే గొప్ప అని ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ తీరు నవ్వులపాలవుతూనే ఉంది. తాజాగా, పాకిస్తాన్ పరీక్షించిన ఒక క్షిపణి కూలిపోయింది. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన షాషీన్-3 మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది.