Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బుద్ధి ఇంకా మారలేదు. పహల్గామ్ దాడి తర్వాత, పాక్ సైన్యాన్ని ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా చిత్తు చేసినప్పటికీ, ఇంకా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు. మరోసారి, భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యాన్ని ప్యాంట్లు విప్పించి, పరిగెత్తిస్తున్నా కూడా తమది గ్రేట్ ఆర్మీ అని పాక్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. తమ వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని బెదిరించే ప్రయత్నం…
Afghan -Pak War: పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య తీవ్ర సరిహద్దు పోరాటం జరుగుతోంది. రెండు వైపుల కూడా పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. చివరక సౌదీ అరేబియా, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య 48 గంటల ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉంటే, నిజంగా పూర్తిస్థాయిలో యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు, ఎవరి బలాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా.
Pakistan: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల సరిహద్దు వెంబడి తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. మంగళవారం పాక్ దళాలు, ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 15 మంది సాధారణ పౌరులు చనిపోయినట్లు ఆఫ్ఘాన్ తాలిబాన్ అధికారులు చెప్పారు.
Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి. కుర్రం జిల్లాలో పాకిస్తాన్ దళాలు, ఆఫ్ఘాన్ తాలిబాన్ల మధ్య మంగళవారం రాత్రి మరోసారి దాడులు ప్రతి దాడులు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ తమ 23 మంది సైనికులు మరణించినట్లు, 200 మందికి పైగా తాలిబాన్లను చంపినట్లు చెప్పింది.
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌పై తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఈజిస్ట్ షర్మ్ ఎల్ షేక్‌లో జరిగిన శాంతి సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ఆసిమ్ మునీర్‌ను తన ‘‘ అభిమాన ఫీల్డ్ మార్షల్’’ అంటూ పిలిచారు. గాజాలో శాంతి నెలకొల్పడంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తనకు మద్దతు తెలిపారని, అందుకు ఆయనకు థాంక్స్ అని ట్రంప్ అన్నారు.
Afghan-Pakistan conflict: ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. గురువారం, కాబూల్ నగరంపై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
Pakistan: పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతున్నారు పాక్ తాలిబాన్లు. తాజాగా మరోసారి పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ ఘటన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఖైబర్ జిల్లాలో జరిగింది. తిరా ప్రాంతంలోని హైదర్ కందావో సైనిక పోస్టుపై దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఇత్తిహాదుల్ ముజాహిదీన్ పాకిస్తాన్‌తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులు దాడికి పాల్పడినట్లు ప్రకటించాయి.
Lashkar-e-Taiba: ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. సింధు జల ఒప్పందం నిలిపేయడం ద్వారా భారత్ పాకిస్తాన్లో వరదలకు కారణమైందని నిందించాడు. ప్రధాని మోడీకి గుణపాఠం చెప్పే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అభ్యర్థిస్తామని వీడియో సందేశంలో కసూరీ చెప్పాడు.
India-Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తా్న్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ సమయంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విమరణకు బ్రతిమిలాడటంతో, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.