Terror Sites: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ దాడులు చేసింది.
ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్కు బిగ్ షాక్ తగిలింది. పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ-100 బుధవారం తెల్లవారుజామున ప్రారంభ ట్రేడింగ్లో 6,272 పాయింట్లు ( 6 శాతం) మేర నష్టపోయింది. అయితే, మంగళవారం ముగింపు స్థాయి 113,568.51 నుంచి 107,296.64 కనిష్ట స్థాయికి పడిపోయింది.
China Terms India's Strikes: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశానికి చెందిన సైన్యం జరిపిన దాడులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దాయాది దేశంపై ఇండియా దాడి చేయడం విచారకరం అని అభివర్ణించారు.
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదులను నాశనం చేసేందుకు భారత్ ఇలాగే దాడులు కొనసాగించాలని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఎక్స్ వేదిగా పోస్ట్ చేశారు.
భారత్ సైన్యం చేసిన దాడిలో 4 జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం అయ్యాయి. పాకిస్తాన్లోని బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతంలో ఈ హెడ్క్వార్టర్ ఉంది. సుమారు, 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శిబిరం నుంచే 2019లో పుల్వామా దాడికి ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు.
మొత్తం ఆపరేషన్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. భారత ఆర్మీకి సపోర్టుగా నిలిచారు. ఇక, ఉగ్రవాద శిబిరాలపై దాడుల వివరాలను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు తెలియజేశారు.
80 Terrorists Killed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో భారత్ తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస దాడుల్లో సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి.
గత నెలలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన దాడి తర్వాత బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడి చేసింది. క్షిపణి దాడిలో కనీసం ఎనిమిది మంది మరణించారని పాకిస్తాన్ తెలిపింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిన ఫిరంగి దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారని భారత సైన్యం తెలిపింది. Also Read:Rajnath Singh: ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే భారత్ లక్ష్యం.. ఈ…