జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడితో భారత్ రగిలిపోయింది. దీని ప్రతీకార చర్యను పాకిస్థాన్ గుర్తించలేక పోయింది. కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఉగ్రవాదులను అంతం చేయడంలో భారత్ సఫలమైంది. భారత సైన్యం దూకుడు విధానాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదు. ఈ వైమానిక దాడి సంవత్సరాల తరబడి పాకిస్థాన్‌లో ప్రతిధ్వనిస్తుంది. ఈ దాడిలో అత్యంత భయంకరమైన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ కుటుంబీకుల రక్తం చిందింది. వందలాది మందిని పొట్టన బెట్టుకున్న ఈ మూర్ఖుడు తన కుటుంబీకుల్లో పది మందిని పోగొట్టుకోగానే కన్నీరు కారుస్తున్నాడు.
READ MORE: Mock Drill: సైరన్ మోగిన వెంటనే ఏం చెయ్యాలంటే?
ఈ దాడి తర్వాత.. చిటికెడు సింధూరం ఖరీదు పాకిస్థాన్‌లో ఊహకు కూడా అంద లేదు. భారతీయ మహిళల జీవితాల్లో ఈ బొట్టు ప్రాముఖ్యతను భారత సైన్యం పాకిస్థాన్‌కు తెలిసేలా చేసింది. చిటికెడు సింధూరం ఉగ్రవాదంపై యుద్ధానికి నాంది పలికిందనే చెప్పాలి. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు హిందువులను ఎంచుకుని చంపారు. చాలా మంది మహిళలను వితంతువులుగా చేశారు. ఒక నవవధువు భర్తను ఆమె ముందే కాల్చి చంపారు. ఉగ్రవాదులు ఆ మహిళతో ‘వెళ్లి మోడీకి చెప్పు’ అన్నారు. దీనిని మోడీ సీరియస్‌గా తీసుకున్నారు. సిందూరానికి హిందూ మతంతో విడదీయరాని సంబంధం ఉంది. అంతేకాకుండా.. ఉగ్రవాదులు మహిళల నుదుటన సిందూరాన్ని చెరిపేశారు. పెళ్లై నెలలు కూడా గడవక ముందే నవ వధువులు వితంతువులుగా మారారు. దీనిని భారత్ భరించలేకపోయింది. అందుకే ఈ ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టారు.
READ MORE: Pakistan: భారత్‌పై యుద్ధానికి సిద్ధమైన పాక్.. దేశాన్ని ఉద్దేశించి పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రసంగం..
అలాగే ఈ ఆపరేషన్‌లో మరో విశేషం ఉంది. ఈ ఆపరేషన్ వివరాలను కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు వెల్లడించారు. చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్ సంగతులను మహిళా అధికారులు వెల్లడించడం విశేషం. ఈ ఆపరేషన్‌కు కూడా ‘సిందూర్’ అని పేరు పెట్టి బలమైన సందేశం ఇచ్చారు. ఈ ఉగ్ర దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీనిని చూడొచ్చు.