తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు పాదయాత్ర మొదలవుతుందా..? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. లా అండ్ ఆర్డర్ కారణాల వల్ల చివరి నిమిషంలో పోలీసులు మార్చ్‌కు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.
రేవంత్ రెడ్డి సీఎం కావాలని సత్తుపల్లి నుండి భద్రాద్రి రాములోరు వద్దకు కాంగ్రెస్ నేత మానవతారాయ్ పాదయాత్ర చేపట్టనున్నారు. మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఆశీస్సులతో డిసెంబరు 12,13 తేదీల్లో పాదయాత్రకి మాజీ ఆత్మకమిటీ చైర్మన్ నున్నా రామకృష్ణ, ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు, సత్తుపల్లి సొసైటీ వైస్ ఛైర్మన్ గాదె చెన్నకేశవరావులు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు.
Andhra Pradesh: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోకి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రవేశించింది. అయితే పసలపూడి గ్రామానికి చేరుకోగానే అమరావతి రైతులకు నిరసన సెగ తగిలింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు అమరావతి రైతుల యాత్రకు అడ్డుతగిలారు. అటు పోలీసులు కూడా అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్నారు. హైకోర్టు కేవలం 600 మందికే అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులతో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు. ఐడీ కార్డులు చూపించిన వారిని…