JC Prabhakar Reddy Emotional: యువగళం పేరుతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 70 రోజులకు చేరుకున్న విషయం విదితమే.. అయితే, లోకేష్ పాదయాత్రపై భావోద్వేగానికి గురయ్యారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టుకున్నారు.. కార్యకర్తలు లేకపోతే నేను లేనన్న ఆయన. చంద్రబాబు చేసిన మంచి పనులతో ప్రజల మనిషి అయ్యారని పేర్కొన్నారు.. ఇక, లోకేష్ జనం కోసం పాదయాత్ర…
ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. రెండవ రోజు ఇచ్చోడ నైట్ హాల్ట్ పాయింట్ నుంచి పీపుల్స్ మార్చ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి రోజు పిప్పిరి నుంచి ఇచ్చోడ వరకు యాత్ర కొనసాగింది. నేడు సిరికొండలో సాయంత్రం కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడనున్నారు.
తెలంగాణలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో చేయనున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలో పాదయాత్ర చేస్తున్నారు. సంఘిన సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లింది. ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ అమలులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.