మాజీ సీఎం చంద్రబాబు, లోకేష్ లపై మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీశైలంలో అన్నదాన సత్రాల ఏర్పాటు చేస్తామని 15 అప్లికేషన్లు వరకు వచ్చాయి.విలువైన భూములను అన్నదాన సత్రాలకు ఇస్తోన్నా.. వాటి ద్వారా ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు.ఛౌల్ట్రీలకు వచ్చే రూమ్ అద్దెల్లో 40 శాతం దేవస్థానానికి వచ్చేలా నిబంధనలు.కొత్త ఛౌల్ట్రీలే కాకుండా.. పాత ఛౌల్ట్రీల నుంచి ఆదాయం ఏ విధంగా రాబట్టవచ్చో ఆలోచన చేస్తున్నాం.బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 1330 దేవాలయాల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి.ఇవే కాకుండా మరో 1460 దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.దేవాలయం లేని గ్రామం ఉండకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నాం.
దేవాలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం ఏఈలను ఔట్ సోర్సింగ్ పద్దతిన నియమించేలా చర్యలు.హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా దేవాలయాల నిర్మాణం.5 వేల గుళ్లకు ధూప దీప నైవేద్యం కోసం నిధులిస్తున్నాం.చంద్రబాబు ఓ పిచ్చి కొడుకుని కన్నాడు.పిచ్చొడు పాదయాత్ర చేస్తున్నారు.లోకేష్ పాదయాత్రలో బూతులు మాట్లాడుతున్నాడు.. బూతు అర్దం వచ్చేలా సైగలు చేస్తున్నారు.చంద్రబాబు హయాంలో కరవు మండలాలు ఉన్నాయి.. జగన్ హయాంలో ఒక్క కరవు మండలం కూడా లేదు. లోకేష్ పాదయాత్ర చేస్తోంటే అన్ని అపశకునాలే అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Read Also: Naga Shourya: వారితో రోడ్డుపై నాగ శౌర్య రచ్చ.. సారీ చెప్పు ముందు అంటూ
టీటీడీ బోర్డు పదవులను జగన్ అమ్ముకున్నారంటూ పిచ్చొడు లోకేష్ ఏదో పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు.ఎంపీ నుంచి ఎంపీటీసీ స్థానాలను అమ్ముకుంది చంద్రబాబే.గతంలో సారా కాంట్రాక్టర్లకు టీటీడీ పదవులు అమ్ముకున్నది ఎవరో అందరికీ తెలుసు.ప్రభుత్వం దేవదాయ భూములను అమ్మేస్తున్నారని ఏదేదో ఆరోపణలు చేశారు.సదావర్తి భూములను అమ్మే ప్రయత్నం చేసిందెవరో అందరికీ తెలుసు.ఏపీలో పొలిటికల్ గ్యాప్ లేదు.ఏ సామాజిక వర్గానికి సీఎం పదవి కావాలనే చర్చ లేదు.ప్రజలకు అన్నీ మంచి పనులు చేసేవాడే సీఎం.కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను పార్టీలో చేర్చుకుంటే సరిపోతుందా..?కాపులను సీఎంను చేస్తామనేది కేసీఆర్ విధానమేమో..?
కేఏ పాల్ కూడా తన విధానంతో రాజకీయం చేస్తున్నారు.కేసీఆర్ వేయి కోట్ల రూపాయలను పవన్ కళ్యాణ్ కు ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది.నిజా నిజాలేంటో ఆ ప్రచారం చేసేవాళ్లకే తెలియాలి.సోము వీర్రాజు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి.సగం సగం తెలుసుకుని సోము వీర్రాజు మాట్లాడ్డం సరికాదు.ఇప్పటికే సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఓ గ్రూప్ ఢిల్లీకి వెళ్లారు. ఇంకెంత మంది వెళ్తారో..? అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Read Also: Top Headlines @ 5PM: టాప్ న్యూస్