సుశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఆగస్ట్ 27న జనం ముందుకు వచ్చింది. మీనాక్షి చౌదరి, వెంకట్, ఐశ్వర్య, అభినవ్ గోమటం, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దర్శన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయిలగుండ్ల నిర్మించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్…
తమిళ చిత్రసీమలో కమెడియన్ సంతానంకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతనికంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు. దాంతో సంతానం హీరోగానూ తన అదృష్టం పరీక్షించుకునే పనిలో పడ్డాడు. అలా మూడేళ్ళ క్రితం ‘సర్వర్ సుందరం’ అనే సినిమా తెరకెక్కింది. కానీ గ్రహచారం బాగోక ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా అది ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోలేదు. అయితే… గత యేడాది ఈ సినిమా దర్శకుడు ఆనంద్ బల్కీ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై అభిప్రాయం చెప్పమని నెటిజన్లను కోరాడు.…
కరోనా కారణంగా ప్రస్తుతం ఓటీటీల హావా నడుస్తున్న తరుణంలో ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ థియేటర్లకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆగస్టు 6న విడుదల అయిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లోనూ మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూసి.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఆశర్యపోయిందట. దీంతో భారీ రేటుతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 27 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై…
ఇవాళ ఓటీటీలతో తమిళ టెలివిజన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కాని చిత్రాలను ఓటీటీతో పోటీగా శాటిలైట్ హక్కులు పొంది, తమ ఛానెల్స్ లో ప్రసారం చేస్తున్నాయి. అలా… ఐశ్వర్య రాజేశ్ నటించిన ఎకో హారర్ థ్రిల్లర్ ‘భూమిక’ తమిళ చిత్ర ప్రసార హక్కులను విజయ్ టీవీ పొందింది. ఆగస్ట్ 22న ఈ సినిమాను ప్రసారం చేయబోతోంది. విశేషం ఏమంటే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ 23వ తేదీ దీనిని…
కన్నడ హిట్ సినిమా ‘దియా’ తెలుగులో విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 19న డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కన్నడలో వచ్చిన ఈ ప్రేమకథ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కె.ఎస్.ఎస్ అశోక దర్శకత్వం వహించిన ఈ ట్రైయాంగిల్ ప్రేమ కథలో ఖుషీ రవి, పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి అద్భుతంగా నటించారు. ఈ సినిమాను ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరిగాయి. కాగా, తాజాగా ఆగస్టు 19న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న…
కరోనా లాక్ డౌన్ నుంచి అన్ని రంగాలకు విముక్తి లభించిన.. సినిమా థియేటర్లు మాత్రం కాస్త ఓపికపడుతున్నాయి. బడా సినిమాల విడుదల కోసం థియేటర్ల యాజమాన్యాలు వేచిచూస్తున్నాయి. దీంతో ఓటీటీ సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ వేదికలపై విడుదలై మంచి సక్సెస్ సాధించడంతో మరిన్ని సినిమాలు అదే దారిలో ప్రయాణిస్తున్నాయి. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ సినిమాలు నారప్ప, దృశ్యం2 సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయనే ప్రచారం జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కినేని అఖిల్ నటిస్తున్న…
మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘కోల్డ్ కేస్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 30న స్ట్రీమింగ్ కాబోతోంది. నిజానికి దీనిని మొదట థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడంతో మూవీ మేకర్స్ అమెజాన్ ప్రైమ్ కు హక్కులు ఇచ్చేశారు. దాంతో ఈ నెల 30న దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ సంస్థ తెలియచేసింది. చాలా కాలం గ్యాప్…
బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తాప్సీ కేరాఫ్ అయ్యారు. తాజాగా ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రష్మీ రాకెట్’. ఇందులో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీగా తాప్సీ కనిపించనుంది. అకర్ష్ ఖురానా దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాల, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విడుదలపై బీటౌన్‌లో ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత ఓ నిర్ణయానికి వచ్చినట్లు త్వరలోనే అధికారిక…
విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘పాగల్’. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈ పాటికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేదీ సినిమా. ‘హిట్’తో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న విశ్వక్ సేన్ కి బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు ఉంది. విశ్వక్ తో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెరకెక్కించిన క్రేజీ లవ్ స్టోరీ చిత్రం ‘పాగల్’. థియేటర్లలో విడుదల కాని ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. విశ్వక్…
కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల సినిమాల లాంగ్ రన్ తగ్గిపోయింది. శతదినోత్సవాలు కరువై అర్థశతదినోత్సవాలే దిక్కయ్యాయి. ఇప్పుడు అదీ పోయింది ఓపెనింగ్ వీక్ లో ఎంత వస్తే అంతే. అయితే స్టార్ హీరోల సినిమాల వరకూ కొంత వెలుసుబాటు ఉండేది. కొంతలో కొంత బాగున్న స్టార్ హీరోల సినిమాలు 5, 6 వారాలు గట్టిగా నిలబడి 50 రోజులైనా ఆడేవి. కరోనా తర్వాత ఓటీటీ ట్రెండ్ తో అదీ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల కాలం వరకూ…