కరోనా కారణంగా ప్రస్తుతం ఓటీటీల హావా నడుస్తున్న తరుణంలో ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ థియేటర్లకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆగస్టు 6న విడుదల అయిన ఈ సినిమా కరోనా పరిస్థితుల్లోనూ మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూసి.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఆశర్యపోయిందట. దీంతో భారీ రేటుతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 27 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అనౌన్స్ మెంట్ రానుంది. శ్రీధర్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ జంటగా నటించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది కిరణ్ అబ్బవరమే కావటం విశేషం.