తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రం ‘తలైవి’.. లేడి ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత నటించింది. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. శశికళగా పూర్ణ నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని రేపు (సెప్టెంబరు 26) ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ ఒటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.