ఆ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ అక్కడ ఉన్న నేతల మధ్య మాత్రం సమన్వయం ఉండడం లేదా? మాజీ మంత్రి ఇంట్లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే..ఎమ్మెల్సీ,జిల్లా అధ్యక్షుడు డుమ్మా కొట్టారా?ఊళ్లోనే ఉండి మరి.. కావాలనే హాజరు కాలేదా? అదే టైమ్‌లో మరో ముగ్గురు నేతలు పోలోమంటూ ఆ మాజీ మంత్రి ఇంట్లో స్థానిక ఎన్నికల సమన్వయ సమీక్షకు అటెండ్ అయ్యారా?అసలు తాతా-పువ్వాడ మధ్య గ్యాప్‌కు కారణాలేంటి?ఖమ్మం గులాబీ గుమ్మంలో కుమ్ములాట ఎక్కడిదాకా వెళ్తుంది?
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చాలాకాలం తర్వాత నియోజకవర్గానికి చేరుకున్నారు.ఖమ్మంలో జరుగుతున్న దుష్పచారాన్ని కొట్టిపారేశారు.మరోసారి సీఎంగా కేసీఆర్ చూడాలని వుందని కార్యకర్తల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్‌కి ఇంకా నగరంలో పట్టు ఉండేలా పువ్వాడ అజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ పార్టీని ఖాళీ చేయించడంలోమాత్రం ఇప్పటి వరకు కాంగ్రస్ సక్సస్ కాలేదనేది ఆయన భావన. కానీ బీఆర్ఎస్‌కి చెందిన వారు పలువురు నాయకులు అంటే మేయర్‌తోపాటుగా పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ…ఇంకా బీఆర్ఎస్‌కు కార్పోరేషన్ లో మంచి పట్టు ఉంది. ఇంకా ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు వున్నారు.
తాజా పరిణామాలు చూస్తే బీఆర్ఎస్‌ను అంతర్గత విభేదాలు వదిలిపెట్టడం లేదు.గతంలో అధికారంలో ఉన్న సమయంలోనే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ తాతా మధుల మధ్య విభేధాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి నడుమ డిస్ప్యూట్స్ కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యాలయాన్నీ అజయ్ కుమార్ ఎప్పుడు పట్టించుకోరు. తాతా మధు మాత్రం పార్టీ కార్యాలయం కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. గతంలో కొంత మంది అధికారుల విషయంలోనూ వీరిద్దరి మధ్య తేడాలొచ్చాయి. ఒక అధికారికి అజయ్ సపోర్టు చేస్తే…ఆ అధికారిని తాతా మధు వ్యతిరేకించే వారు. ఇప్పుడు మరోసారి కోల్డ్ వార్ బయటపడిందనే టాక్ నడుస్తోంది.
అజయ్ చాలా కాలంగా నియోజకవర్గానికి రావడం లేదు. లోకల్ ఎలక్షన్లు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండడంతో తన ఇంటిలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎన్నికలకు సంబందించిరివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు , మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో పాటుగా పలువురు కౌన్సిలర్లు, నాయకులు హాజరయ్యారు. వీరికి తోడుగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిన రాకేష్ రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు కానీ తాతా మధు మాత్రం హాజరు కాలేదు. అదే ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.
అజయ్ పాల్గొనే కార్యక్రమానికి రాను అన్నట్లుగానే తాతా మధు వ్యవహార శైలి ఉందంట. ఎందుకంటే గతంలో మంత్రిగా ఉన్న సమయంలో పట్టించుకోలేదని బాధ తాతా మధుకు ఉన్నదంట. అందువల్లనే వారి మద్య గ్యాప్ చాలా పెరిగింది. మిగిలిన నాయకులతోనూ పువ్వాడకు అలానే ఉన్నప్పటికీ వారు మాత్రం అధికారం లేదు కాబట్టి రాజీ పడుతూ ఉన్నారు. తాతా మధు మాత్రం రాజీ పడడం లేదని స్పష్టమవుతుంది. గురువారం జరిగిన సమావేశంలో తాను మళ్లీ ఖమ్మం నుంచే పోటీ చేస్తానని తన ఆరోగ్యం గురించి ఎవ్వరు ఆందోళన చెందొద్దని, బాగా ఉన్నా… తన మీద దుష్పచారం జరుగుతుందని అన్నారు పువ్వాడ.
ఇప్పుడే కాదు ఎన్నికల ముందు ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా పార్టీ నాయకత్వం వ్యవహరించింది. ఇప్పుడు అదే విధంగా ఉందని డౌట్స్ వస్తున్నాయి. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యాలయంలో అందరు నాయకులు కార్యక్రమాల్లో పాల్గొనే వారు … కానీ అజయ్ మాత్రం పార్టీ కార్యాలయానికి వచ్చేది చాలా తక్కువ ఎప్పుడన్న పెద్ద పెద్ద నేతలు జిల్లాకు వస్తే తప్ప ఆయన పార్టీ ఆఫీసుకు రారు. ఈ క్రమంలో బతుకమ్మ ఉత్సవాలను పార్టీ ఆఫీసులో తాతా మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.దీనికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవుతున్నారు. అజయ్ వర్గం దీనిలో యాక్టివ్ గా నే పాల్గొంటుంది.ఎప్పుడు పార్టీ కార్యాలయానికి రావడానికి ఇస్టపడని అజయ్ .. తన ఇంటిలో సమావేశానికి తాను ఎందుకు హాజరు కావాలన్నది తాతా మధు అభిప్రాయమట.
త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఖమ్మం జిల్లా నాయకులంతా ఐక్యంగా ఉండాలి.కానీ ఈ పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఇది పార్టీ మీద ప్రభావం చూపిస్తుందని గులాబీ శ్రేణుల ఫీలింగ్. ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ముందుడి నడిపించాల్సిన జిల్లా అధ్యక్షులే..డుమ్మా కొట్టడం…గులాబీ తోటలో కుమ్ములాటను మరింత ముదిరేలా చేస్తుంది.