వర్మ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మరో ట్వీట్ చేశారు.. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో నిన్న విచారణ పూర్తయిన అనంతరం ఎక్స్ లో స్పందించిన ఆర్జీవీ.. ''ఐ లవ్ ఒంగోలు.. ఐ లవ్ ఒంగోలు పోలీస్.. ఈవెన్ మోర్.. 3 ఛీర్స్...'' అంటూ రాసుకొచ్చిన వర్మ.. పెగ్గుతో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశారు..
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఈ నెల 25వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ కి హాజరుకావాల్సింది ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపించారు.. దర్శకుడు రాంగోపాల్ వర్మ వాట్సప్ నంబర్‌కు సంబంధిత నోటీసు పంపించారు సీఐ శ్రీకాంత్.