Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది.. అయితే, పోలీసుల విచారణకు ఆర్జీవీ వస్తాడా? రాడా? అనేది ఉత్కంఠగా మారింది.. కాగా, వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ఏడాది నవంబర్ లో మద్దిపాడు పీఎస్ లో వర్మ పై కేసు నమోదు అయ్యింది.. ఇదే సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా పలు పీఎస్‌లలో ఆర్జీవీపై కేసులు నమోదు అయ్యాయి..
Read Also: Telangana Rains Today: నేడు తెలంగాణలో భారీ వర్షం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
అయితే, ఈ కేసులో హైకోర్టులో బెయిల్ పొందారు వర్మ.. ఇదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేయగా.. గత ఫిబ్రవరిలో ఒంగోలు రూరల్ స్టేషన్ లో ఓ సారి విచారణకు హాజరయ్యారు వర్మ.. మరోసారి విచారణకు హాజరుకావాలంటూ గత నెల 22వ తేదీన వర్మకు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఇవాళ విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చారు వర్మ.. దీంతో వర్మ విచారణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.. అయితే, పోలీసుల విచారణకు ఆర్జీవీ హాజరవుతారా? లేదా చివరి నిమిషంలో ఇంకా ఏదైనా మెలిక పెడతారా? అనేది ఉత్కంఠగా మారింది..