ఓఆర్ఆర్ నుంచి కోదాడ వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. కారు వెనుకనుండి ఢీకొట్టింది లారీ. వాళ్లని హాస్పటల్ కు తరలించే సమయంలో మరో కారు ఆగింది. అంతేకాదు, ఆ కారు వచ్చి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. గాయపడ్డవారు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.…
హైదరాబాద్ లో ఓ హోటల్‌లో విషాదం చోటుచేసుకుంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4 లో ఉన్న GIS హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందాడు. అతని వయసు 29 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ముద్దం అనే తండాకు చెందిన శివాజీ గణేష్ బతుకు తెరువు కోసం 2019లో హైదరాబాద్ వచ్చాడు. బంజారాహిల్స్‌లో జీఐఎస్ హోటల్లో సూపర్ వైజర్‌గా…
తూర్పుగోదావరి జిల్లాలో స్కార్పియో వాహనం బీభత్సం కలిగించింది. ఒకరు దుర్మరణం పాలయ్యారు. కత్తిపూడి నుండి పిఠాపురం వైపు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పింది. గొల్లప్రోలు టోల్ ప్లాజా నుండి ఆపకుండా గేట్ ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది CG1100 నెంబర్ గల స్కార్పియో వాహనం. దీంతో కారును వెంబడించారు గొల్లప్రోలు హైవే పోలీసులు. పిఠాపురంలో బైపాస్ రోడ్ విరవాడ జంక్షన్ వద్ద వేగంగా వచ్చి యాక్టివా బైక్ ను ఢీకొట్టింది స్కార్పియో వాహనం. బైక్…
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం సలాక్ పూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఎయిర్ గన్ మిస్ ఫైర్ కావడంతో ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు. సలాక్ పూర్ గ్రామంలో ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు ఎనిమిది మంది హైదరాబాద్ స్నేహితులు. రాత్రి విందు చేసుకొనే క్రమంలో షికారుకు వెళ్ళారు. ఆసమయంలో ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో మిషాక్ అనే యువకుడి తలకు బలంగా తగిలింది. దీంతో గాయపడిన మిషాక్ ని…
తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కార్యాలయం సమీపంలో ప్రమాదం జరిగింది. ఉదయం తొమ్మిదిగంటల సమయంలో ప్రధాన సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో పెద్ద చెట్టు కూలింది. ఈప్రమాదంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత నుజ్జునుజ్జు అయింది. కొన్ని వాహనాలకు నష్టం వాటిల్లింది. గాయపడిన వారిలో ఒకరిని చికిత్స నిమిత్తం చేర్చారు. ఫోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమంత్రి యూనిట్ సమీపంలోని చెట్టుకింద ఓ పెద్ద చెట్టు వాలిన విషయం తెలిసిందే. ముత్యాల్‌పేట మహిళా గార్డు కవిత…