న్యూయార్క్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బ్రోంక్స్‌లో చోటు చేసుకుంది. దుండగులు స్కూటర్లపై వెళుతూ కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక సిగ్నల్ వద్ద రెండు స్కూటర్లపై వచ్చిన దుండగులు దాదాపు 10 షాట్లు కాల్చినట్లు అసిస్టెంట్ పోలీస్ చీఫ్ బెంజమిన్ గుర్లే వెల్లడించారు.