కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది కరోనా రక్కసి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభన ఇప్పటికే భారత్‌లో మొదలైంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగిపోయింది. రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదువుతోంది.
అయితే బ్లాక్ ఫంగస్ కేసులు కూడా మళ్లీ వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగించే విషయం. యూపీలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కంట్లో నొప్పిగా ఉందని ఓ వ్యక్తి ఆసుపత్రి వచ్చాడు. దీంతో సదరు వ్యక్తి వైద్యుల కరోనా పరీక్షలు నిర్వహించిగా కరోనా సోకినట్లు తేలింది. అంతేకాకుండా ఆ వ్యక్తి షుగర్ కారణంగా బ్లాక్ ఫంగస్ బారినపడినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సదరు వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.