యావత్తు ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. రకరకాలుగా రూపాంతరాలు చెందిన మానవజాతిని శాసిస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఇప్పడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ మరింత భయాందోళకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. పలు రాష్ట్రాల్లో వ్యాపించిన ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎయిడ్స్ డాక్టర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా…
వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని, పిల్లలు పుట్టరనే అపోహలు చాలా మందిలో ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో అంటే సరిలే అనుకోవచ్చు. కానీ, అభివృద్ది చెందిన ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి సందేహిస్తున్నారు. లండన్‌లో కరోనా, ఒమిక్రాన్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. Read: తెలంగాణలో మొత్తం 20 ఒమిక్రాన్ కేసులు నమోదు ప్రస్తుతం లండన్‌లో ఇంగ్లీష్ ప్రీమియం ఫుట్‌బాల్ లీగ్…
2020లో సార్స్ కోవ్ 2 వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఇబ్బందులు పెట్టంది. సార్స్‌కోవ్ 2 వైరస్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ను విధించారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కాగా, ఈ ఏడాది మార్చి నుంచి డెల్టా వేరియంట్ సునామీలా దూసుకొన్ని గజగజా వణికించింది. కోట్లాది మంది డెల్టా వేరియంట్ బారిన పడ్డారు. లక్షలాది మంది మృతి చెందారు. వైరస్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. తగ్గినట్టే తగ్గి వైరస్ కొత్తగా మార్పులు చెంది ఎటాక్ చేస్తున్నది. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా ప్రపంచంలోని దేశాలను చుట్టేస్తున్నది. సౌతాఫ్రికాలో ప్రారంభమైన ఈ వేరియంట్ ఇప్పటికే సుమారు వందకు పైగా దేశాల్లో విస్తరించింది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఒమక్రాన్ కారణంగా కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. రెండు రోజుల్లోనే ఒమిక్రాన్ కేసులు డబుల్ స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్,…
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న 87 కేసులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 101 కి చేరింది. దేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు ఉండగా, ఢిల్లీలో ఈ సంఖ్య 22 కి చేరింది. రాజస్థాన్‌లో 17, కర్ణాటక, తెలంగాణలో 8 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని, అందరూ తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. సౌతాఫ్రికాలో వెలుగు చూసి క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా ఒమిక్రాన్ బారినపడిపోయింది.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి.. 36 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించింది అమెరికా.. ఈ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్.. శీతాకాలంలో మహమ్మారి మరణాలు, తీవ్ర అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటి వరకు వ్యాక్సిన్…
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.. అయితే.. మొదట ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో మాత్రం టెన్షన్ నెలకొంది.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి మెడికల్ టీమ్‌లు… కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో.. ఆ ప్రాంతంలో మరింత…
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో టెన్షన్ పెరిగిపోయింది. ఐదు రోజుల క్రితం కర్ణాటకలో మూడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఆ తరువాత దేశంలోని చాలా రాష్ట్రాల్లో వరసగా కేసులు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 87 కి చేరింది. ఈరోజు తెలంగాణలో నాలుగు కేసులు నమోదవ్వగా, కర్ణాటకలో 5 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోని కర్ణాకటలో 8, తెలంగాణలో 7, ఢిల్లీలో 10, మహారాష్ట్ర 32, రాజస్థాన్ 17,…