తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 14 మందికి కరోనా నిర్ధారణ జరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే మాస్క్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ లేకుంటే భారీ జరిమానాలు విధిస్తున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైతే నైట్…
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్ రక్షణ వ్యవస్థను దాటుకొని విజృంభిస్తుండటంతో కొత్త సంవత్సరం వేడుకలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలపై కర్ణాటక సర్కార్ నిషేధం విధించగా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఢిల్లీ సర్కార్ నిషేధం విధించింది. కాగా, హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి జనవరి 1 తరువాత పూర్తి వ్యాక్సిన్ తీసుకోని వారిని రోడ్డు మీదకు రాకుండా కట్టడి…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్ల వేగంతో ఈ వేరియంట్ విస్తరిస్తోంది. ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేయడం ఖాయమని చెబుతున్నారు. ఈ స్థాయిలో కేసులు పెరగడానికి కారణాలు ఏంటి? ఎందుకు కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను సౌతాఫ్రికాలో గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్‌కు హెచ్ఐవీ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు…
ఒమిక్రాన్ కేసులు ప్రపంచంలో తీవ్రంగా పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రపంచం యావత్తు అతలాకుతలం అవుతున్నది. ఒమిక్రాన్‌పై ఇటీవలే బిల్‌గేట్స్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అన్నారు. ఆయన ఈ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది. ఒమిక్రాన్ కేసులు భారీగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టాయి. దీంతో బిల్‌గేట్స్ తన ప్రకటనపై యుటర్న్ టీసుకున్నారు. ప్రపంచం చాలా దారుణమైన దశకు చేరుకుంటుందని, రానున్న రోజులు…
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తోంది… యూఎస్‌లో పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. గణాంకాలను పరిశీలిస్తే.. గత వారం రోజుల్లో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయంటే.. ఒమిక్రాన్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, న్యూయార్క్ ఏరియాలో తాజా కేసుల్లో 90శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది.. గత వారం…
భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్.. భారత్‌లో అడుగుపెట్టడమే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.. ఈ తరుణంలో రాష్ట్రాలకు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. గతంలో భారత్‌తో పాటు అనేక దేశాలను అతలాకుతం చేసిన కోవిడ్ డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తోందని తెలిపింది.. ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్రం.. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు…
కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు ప్రపంచం కోలుకోలేదు. సార్స్ కోవ్ 2, డెల్టా, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతూనే ఉన్నది. వ్యాక్సినేషన్ తరువాత కరోనా మహమ్మారి కేసులు తగ్గిపోతాయి వచ్చే ఏడాది నుంచి తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేయవచ్చని కంపెనీలు భావించాయి. డెల్టా నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఒమిక్రాన్ ప్రభావం చూపించడం మొదలైంది కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. యూరప్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఆసియా దేశాల్లోనూ క్రమంగా కేసులు…
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. యూరప్, అమెరికా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరలా ఆంక్షలు మొదలవుతుండటంతో దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ఒమిక్రాన్ ముందు వరకు దూసుకుపోయిన సూచీలు మళ్లీ పతనం కావడం మొదలుపెట్టాయి. ప్రపంచంతో పాటు ఇండియాలోనూ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సోమవారం రోజున సెన్సెక్స్ 1190 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లు నష్టపోయింది. Read: వైఎస్ జగన్: వ్యాపారవేత్త నుంచి ముఖ్యమంత్రిగా… మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల…
కరోనా రక్కసి కొత్తకొత్తగా రూపాంతరాలు చెందిన ప్రజలపై విరుచుకుపడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ సమయంలో పలు దేశాల్లో వ్యాప్తి చెందిన దాని ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కునేందుకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే తాజాగా డబుల్ మాస్క్ తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎన్95 మాస్క్‌ను…