యావత్తు ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. రకరకాలుగా రూపాంతరాలు చెందిన మానవజాతిని శాసిస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఇప్పడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ మరింత భయాందోళకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది.
పలు రాష్ట్రాల్లో వ్యాపించిన ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎయిడ్స్ డాక్టర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే తీవ్రంగా ప్రభావం చూపదని ఆయన అన్నారు. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నప్పటికీ ఒమిక్రాన్ ఎక్కువగా బాధించదని.. దాని తీవ్రత ఎక్కువగా ఉండదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే యూకేలో ఒమిక్రాన్ బారినపడివారు మరణిస్తున్నారు. అంతేకాకుండా పలు దేశాల్లోని ప్రభుత్వాలు మరోసారి లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.