దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటంతో హర్యానా సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. సినిమా హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. గురుగ్రామ్, ఫరీదాబాద్ తో పాటు మూడు జిల్లాల్లో రూల్స్ పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 12 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే హర్యానాలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. హర్యానాలో…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ నుంచి 27 మంది కోలుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 52 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,82,215కి చేరింది. ఇందులో…
ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సౌతాఫ్రికాలో బయటపడిని ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. ఒమిక్రాన్ ధాటికి ప్రపంచ ఆరోగ్యం పడకేసింది. యూకే, ఫ్రాన్స్‌లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్‌లో రెండు లక్షలకు పైగా కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఇక యూఎస్‌లో రోజువారి కేసులు 5 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇందులో సగం వరకు ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వలనే కేసులు…
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో 2716 కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసుల కంటే 51శాతం అదనంగా కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలో పాజిటివిటి రేటు 3.64శాతంగా ఉంది. పాజిటివిటి రేటు 0.5 శాతంగా ఉన్న సమయంలోనే ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. అయితే, ఇప్పుడు పాజిటివిటి రేటు 3.64…
మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నది. ముంబైలో ఉదయం సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంది. రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో త్వరలోనే పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మహారాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ థర్డ్ వేవ్‌పై చేసిన…
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడం భయాందోళనలను కలిగిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా చాప కింద నీరులా పాకుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడింది. బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కరోనా బారిన పడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్…
2019లో వెలుగు చూసిన కరోనా మహమ్మారి 2022లోకి అడుగు పెట్టినా వదలడం లేదు.. ఇక, కొత్త కొత్త వేరియంట్లుగా ప్రజలపై ఎటాక్ చేస్తూనే ఉంది.. తాజాగా సౌతాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలకు పాకిపోయిన సంగతి తెలిసిందే.. ఒమిక్రాన్ కేసులతో పాటు.. కోవిడ్ కేసులు కూడా చాలా దేశాల్లో పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి.. కానీ, ఒమిక్రాన్ మొదట వెలుగుచూసిన దక్షిణాఫ్రికా పరిస్థితి వేరుగా ఉంది.. ప్రభుత్వం అక్కడ కొన్ని ఆంక్షలను ఎత్తివేసింది.. కరోనా…
తెలంగాణ ప్రజలకు మంత్రి జగదీశ్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు అందరూ దూరంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉంటే ఏడాదంతా వేడుకలు చేసుకోవచ్చని తెలిపారు. ఒమిక్రాన్ వేరింయంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని మంత్రి ప్రజలను కోరారు. Read Also:చాదర్‌ఘాట్‌లో ఘోర అగ్ని ప్రమాదం ఆరోగ్యాలను కాపాడుకోవడానికి అందరూ ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ప్రాణాలు విలువైనవని అందుకే వేడుకల పేరుతో ఎవ్వరు ప్రాణాల…
ముంబైలో కరోనా నిబంధనలను మరింత కఠినం చేశారు. రోజు రోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ముంబై బీజ్‌లో అనుమతులను నిరాకరించారు. Read: తెలంగాణలో రికార్డ్…