అనేక విలక్షణమైన పాత్రల్లో తనదైన బాణీ పలికించారు నటుడు ఓం పురి. ప్రతిభావంతులను తీర్చిదిద్దే ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ నుండి వచ్చిన ఓం పురి తొలి నుంచీ తనదైన అభినయంతో ఆకట్టుకుంటూనే సాగారు. హిందీ, తెలుగు, తమిళ భాషా చిత్రాలతో పాటు మరికొన్ని భారతీయ భాషల్లోనూ నటించారు. ఇంగ్లిష్ లోనూ అభినయించారు. పాకిస్థాన్ సినిమాల్లోనూ ఓం పురి నటన ఆకట్టుకుంది. అంతర్జాతీయ నటునిగా పేరొందిన ఓం పురి అభినయం ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఓం ప్రకాశ్…