లీటర్ పెట్రోలు ధర ఇప్పుడు 100 రూపాయలు దాటింది. రాష్ట్రాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో 110 రూపాయలుగా కూడా ఉంది. డీజిల్ ధర కూడా వందకు చేరింది. రాబోయే రోజుల్లో పెట్రో ధరలు ఇంకా పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో తరచూ పాక్షిక హెచ్చు తగ్గులు సహజం. ఒక్కోసారి ఉన్నట్టుండి బాగా తగ్గుతాయి. మరి కొన్ని సార్లు ఊహించనంత పెరుగుతాయి. 2020 ఏప్రిల్‌లో ప్రపంచ మార్కెట్లో ముడి…