CS Shanti Kumari: ఈనెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి.. అధికారులతో సీఎస్ సమీక్ష..
- ఈ నెల 28న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన..
- అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CS Shanti Kumari: ఈ నెల 28న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రపతి రాష్ట్రంలో ఒకరోజు పర్యటన సందర్భంగా ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారని తెలిపారు. సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి ప్రారంభిస్తారని తెలిపారు. శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి నిలయంలో పాములు పట్టేవారిని నియమించాలని తెలిపారు. అలాగే రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద, తేనెటీగలు వంటి వాటి నివారణకు ప్రత్యేక బృందాలను జీహెచ్‌ఎంసీ సమన్వయంతో నియమించాలని అటవీ శాఖను ఆదేశించారు. సందర్శనకు వెళ్లే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth Reddy: జమిలి ఎన్నికల అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..
Also Read
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!