Off The Record : కనిగిరి వైసీపీలో దద్దాల వర్సెస్ బుర్రా..
- కనిగిరి వైసీపీలో దద్దాల వర్సెస్ బుర్రా..
- 2019లో కనిగిరి ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్..
- 2024లో బుర్రాను కందుకూరు పంపిన అధిష్టానం, ఓటమి..
- ఓటమి తర్వాత కనిగిరి ఇన్ఛార్జ్‌గా కొనసాగుతున్న దద్దాల నారాయణ..
- తిరిగి కనిగిరి ఎంట్రీ కోసం పావులు కదుపుతున్న బుర్రా..
- కనిగిరి, కందుకూరు రెండూ మా ఫ్యామిలీకేనంటూ స్టేట్‌మెంట్..
- బుర్రా వైఖరిపై రగిలిపోతున్న దద్దాల నారాయణ..
- పార్టీ అధిష్టానం దగ్గరే తేల్చుకుంటానంటున్న దద్దాల..
- కనిగిరి వైసీపీ కేడర్‌లో పెరుగుతున్న గందరగోళం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : ప్రకాశం జిల్లా వైసీపీలో కనిగిరి రాజకీయం రసవత్తంగా నడుస్తోంది. ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ, కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి గెలిచిన మధుసూదన్ యాదవ్‌ను గత ఎన్నికల్లో కందుకూరుకు షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం. కానీ…. అక్కడ ఓడిపోయాక తిరిగి తన పాత నియోజకవర్గం మీదికే బుర్రా మనసు మళ్ళింది. కనిగిరి అయితేనే తనకు సేఫ్ అన్న ఉద్దేశ్యంతో…. ఈసారి అక్కడి నుంచే పోటీ చేస్తానని సన్నిహితులకు చెబుతున్నారట. ఆ విషయం తన చెవిన పడ్డాక దద్దాల నారాయణ రగిలిపోతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో కనిగిరి నుంచే పోటీ చేసి ఓడిపోయారాన. హనుమంతునిపాడు జడ్పీటీసీగా ఉన్న దద్దాల అనూహ్యంగా 2024లో ఇక్కడ సీటు దక్కించుకున్నారు. ఇక ఓటమి తర్వాత కూడా కనిగిరి ఇన్ఛార్జ్‌గానే కొనసాగుతూ… ఏదో, అలా అలా బండి కూల్‌గా నడిచిపోతోందని అనుకుంటున్న టైంలో బుర్రా బాంబు పేల్చడం దద్దాల వర్గానికి అస్సలు మింగుడు పడ్డంలేదని అంటున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా….. బుర్రా మధు తరచూ కనిగిరి నియోజకవర్గంలోని తన సన్నిహితులతో పాటు దద్దాల నారాయణ వ్యతిరేక వర్గంతో కూడా తరచూ టచ్‌లోకి వెళ్ళి అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే తాను నియోజకవర్గ భాద్యతలు తీసుకుంటున్నానని ఇటీవల తరచూ చెప్పడంతో తెర వెనక ఏదో జరిగిపోతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇన్నాళ్ళు క్లోజ్ సర్కిల్స్‌కే పరిమితం అయిన బుర్రా మాటలు ఈ మధ్య కాలంలో ఓపెన్ అయిపోవడంతో… దద్దాల నారాయణ వర్గం కూడా అలర్ట్ మోడ్‌లోకి వచ్చేసింది. దీంతో మేటర్ మాంఛి రసకందాయంలో పడుతోంది. ఇదే సమయంలో ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే. నేను కందుకూరులోనే ఉంటా. ఈసారి కనిగిరి, కందుకూరు రెండు సీట్లు కావాలని అడుగుతున్నా…. అధిష్టానం కూడా అందుకు సిద్ధంగా ఉంది….. నేనొక చోట, నా కుమారుడు ఇంకో చోట పోటీ చేస్తామని చెప్పడం ఇంకా ఆసక్తికరంగా మారింది. బుర్రా ప్రెస్‌మీట్‌లో చెప్పిన ఆ మాటల్ని కందుకూరులో పెద్దగా పట్టించుకోకపోయినా…. కనిగిరి నియోజకవర్గంలోని కొందరు ఆయన అనుచరులు పార్టీ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయటం వివాదాస్పదంగా మారింది. నేను ఆల్రెడీ ఇన్ఛార్జ్‌గా ఉన్నప్పుడు బుర్రా అలా మాట్లాడ్డం ఏంటంటూ…దద్దాల నారాయణ ఫైరైపోతున్నట్టు సమాచారం.
Also Read
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతి నుంచే మధుసూదన్‌యాదవ్ వ్యవహారం ఇలాగే ఉందని, వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తూ కనిగిరిలో పార్టీని నాశనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారాయన. ఈ పరిణామాలన్నిటినీ పార్టీ అధ్యక్షుడు జగన్ దృష్టికి తీసుకువెళ్ళే ప్లాన్‌లో ఉందట దద్దాల వర్గం. బుర్రాతో ఇక అమీతుమీ తేల్చుకుంటానని కూడా అంటున్నట్టు చెప్పుకుంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే ప్రతిసారి ఇలాగే మాట్లాడుతుంటే కేడర్‌లో కూడా గందరగోళం పెరుగుతుందని, అందుకే పార్టీ పెద్దలు వీలైనంత త్వరగా ఈ విషయంలో క్లారిటీ ఇస్తే మంచిదన్నది నారాయణ అభిప్రాయం. కనిగిరి క్వశ్చన్స్‌కు ఆన్సర్స్ దొరుకుతాయా? లేక అధిష్టానం వీలైనంత ఎక్కువ కాలం నానబెడుతుందా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!