సంగారెడ్డిలో డీఎంహెచ్‌వో కుర్చీకోసం ఎత్తుగడలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకరికేమో ప్రభుత్వంలోని పెద్దల అండ. ఇంకొకరికి అదే శాఖలో బడా బాబుల ఆశీస్సులు. ఇలా పెద్దోళ్లే వెనకుండటంతో ఒకే కుర్చీకోసం కుస్తీ పడుతున్నారు ఆ ఇద్దరు అధికారులు. బదిలీ అయినా వెళ్లకుండా ఒకరు.. ఛార్జ్ తీసుకోవాలని ఇంకొకరు వేయని ఎత్తులు లేవు. అదే ఆ జిల్లా వైద్యవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
సంగారెడ్డి డీఎంహెచ్‌వో పోస్టు కోసం 4 నెలలుగా కుర్చీలాట!
Also Read
జిల్లాస్థాయి పోస్టులంటే రాజకీయ ప్రమేయం లేకుండా జరగవు. మనవాళ్లు అనేవాళ్లను తీసుకొచ్చి కూర్చీలో కూర్చోబెట్టుకోవడం కామన్. సంగారెడ్డి DMHO పోస్ట్ కూడా ఈ జాబితాలోకే చేరింది. కరోనా పగడ విప్పిన సమయంలో DMHO పోస్ట్ చాలా కీలకం. అలాంటిది మార్చి నెల నుంచీ ఈ పోస్ట్ కోసం కుర్చీలాట ఓ రేంజ్‌లో సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లో.. పనిభారమో తెలియదు కానీ.. ఇంఛార్జ్‌గా వచ్చిన అధికారులు పట్టుమని పదిరోజులు ఉండలేని పరిస్థితి. మాతా శిశు సంరక్షణ కేంద్రం POగా ఉన్న గాయత్రీదేవిని ఇంఛార్జ్‌గా మార్చి 30న వేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకే మెదక్ టీబీ ఆఫీసర్ లక్ష్మణ్‌సింగ్‌కు DMHOగా పోస్టింగ్ ఇచ్చారు. సమస్య పరిష్కారమైందని సంబరపడుతున్న సమయంలో అసలు కథ మొదలైంది. నాలుగు నెలలుగా కుర్చీలాట రసరత్తరంగా జరుగుతోంది.
వేర్వేరు ఛాంబర్లు ఏర్పాటు చేసుకున్న అధికారులు!
డీఎంహెచ్‌వోగా వచ్చిన లక్ష్మణ్‌సింగ్‌కు ఛార్జ్ ఇవ్వడానికి గాయత్రీదేవి నిరాకరిస్తున్నారట. ఆమె వెనక కలెక్టర్‌తోపాటు ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తానే డీఎంహెచ్‌వోగా ఉండేందుకే గాయత్రీదేవి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారట. లక్ష్మణ్‌సింగ్ ఛార్జ్ తీసుకోవడానికి నాలుగు నెలలుగా రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. రోజూ ఆఫీస్ వస్తున్నారు.. రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నారు.. సాయంత్రం వెళ్లిపోతున్నారు. DMHO కుర్చీలో కూర్చోకుండా.. వేర్వేరు ఛాంబర్లు ఏర్పాటు చేసుకుని పాలన సాగిస్తున్నారు. ఎవరి మాట వినాలో ఆఫీస్ సిబ్బందికి అర్థం కాని పరిస్థితి.
ఆమెకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు?
లక్ష్మణ్‌సింగ్‌కు డిపార్ట్‌మెంట్ పెద్దల అండ?
ఒక పోస్ట్.. ఇద్దరు అధికారులు!
ప్రభుత్వంలోని పెద్దల ఆశీసులు ఉండటంతో అధికారిక కార్యక్రమాలకు DMHO హోదాలో గాయత్రిదేవికే ఆహ్వానాలు పంపుతున్నారట. అయితే లక్ష్మణ్‌సింగ్‌కు వైద్య ఆరోగ్యశాఖలో పెద్దల మద్దతు ఉందట. దీంతో ఆయనా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. గత నెల 15న లక్ష్మణ్‌సింగ్‌ను నారాయణపేట ఇంచార్జ్ DMHOగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడికి వెళ్లేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఒకరికొకరు ఎదురుపడటం లేదు. లక్ష్మణ్‌సింగ్‌కు ఎక్కడ ఛార్జ్ అప్పగించాలో అని మొదట్లో గాయాత్రీదేవి ఆఫీస్‌కు రాలేదట. ఫైల్స్ అన్నీ ఇంటిదగ్గరే చూసేవారట. ఇప్పుడు ఇద్దరూ ఆఫీస్‌కు వస్తున్నా.. వేర్వేరు ఛాంబర్లో ఉంటూ కాలం గడిపేస్తున్నారు. మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లు.. ఉన్నతాధికారుల పంతాలు.. సంగారెడ్డి DMHO పోస్ట్‌ను కీచులాటగా మార్చేశాయి. ఒక కుర్చీ ఇద్దరు అధికారులు అన్నట్టుగా మారిపోయింది. ఈ విషయం తెలిసినా.. జిల్లాలోని మంత్రులు.. ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటం ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?