అధికారపార్టీ బీఆర్ఎస్కు కొత్త తలనొప్పి వచ్చిపడిందా? ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్సీల పంచాయితీ ఉండగానే.. కొత్తగా మరో రగడ మొదలైందా? కొంతమంది జడ్పీ చైర్మన్ల తీరు చర్చగా మారిందా? జిల్లాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్టానం ఏం చేయబోతుంది? జడ్పీ ఛైర్మన్లు వర్సెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన వారితోపాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని పదవులు కట్టబెడుతూ వస్తోంది బీఆర్ఎస్. ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, జిల్లా స్థాయిలో పదవుల్లో…
మాజీ మంత్రి సుచరిత వైసీపీకి దూరం కాబోతున్నారా? అందుకు కారణం పార్టీపై ఆమె అసంతృప్తి అని కొందరు.. అనారోగ్యం వల్ల అని ఇంకొందరిలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా తన భర్త ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటా అన్న ఆమె మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటి? మంత్రి పదవి పోవడంతో అసంతృప్తిగా ఉన్న సుచరిత వేరే ఆలోచనతో ఉన్నారా? సుచరితకు నిజంగా పార్టీ మారాలన్న ఆలోచన ఉందా.. లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి పని చేస్తుందా?…
అసంతృప్త…అసమ్మతి నేతల అంశాన్ని బీఆర్ఎస్ ఏం చేయనుంది ? అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో…ఆ నేతలను గులాబీ పార్టీ బుజ్జగిస్తుందా ? అవసరం లేదనుకుని లైట్ తీసుకుంటుందా ? ఈ నేతల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై…టిఆర్ఎస్ పెద్దలు వెయిట్ చేస్తున్నారా ? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు…షెడ్యులు ప్రకారం ఈ ఏడాది చివరిలో జరగనున్నాయ్. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలో…అప్పడే అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యేలు నియెజకవర్గాల్లో…