టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీలతో పెనవేసుకున్న నాయకుడు… గంటా శ్రీనివాస్‌రావు. గడచిన ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత గంటా సీన్ మారింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీతో టచ్ మీ నాట్‌గా ఉంటున్నారు. ఈ వైఖరి టీడీపీలోని గంటా ప్రత్యర్థులకు కలిసి వచ్చింది. అడపా దడపా టీడీపీ వేదికలపై మాజీ మంత్రి కనిపిస్తున్నా.. పార్టీ ఫ్లేవరుకు దూరమయ్యారనే ప్రచారం ఉంది. గంటా వైసీపీలో చేరిపోతారనే ప్రచారం…
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఆ జిల్లా మంత్రులు ఒక్కటై తిరుగుబాటు చేయడం బీఆర్ఎస్లో కలకలం రేపింది. ముందెన్నడూ లేనివిధంగా బహిరంగంగా ఓ మంత్రిపై జిల్లా ఎమ్మెల్యేలంతా తిరగబడటం ఆ పార్టీలో సంచలనంగా మారింది. మార్కెట్ కమిటీ నియామకం వివాదంలో.. మంత్రి మల్లారెడ్డితో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి ఏమాత్రం సంబంధం లేకున్నా.. ఆ రహస్య సమావేశానికి హాజరయ్యారు. ఆ మరుసటి రోజే శంకుస్థాపనకు వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మీకి అవమానం జరగడం.. పార్టీలో తీవ్ర చర్చగా మారింది.…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ముందస్తు ఎన్నికలపైనా ప్రచారం జరుగుతోంది. రాబోయే మూడు నాలుగు నెలలు కమలం పార్టీకి కీలకం. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కూడా ముఖ్యమే. అందుకు పెద్దఎత్తున చేరికలు అవసరం. అయితే బీజేపీలో అనుకున్నంతగా చేరికలు లేవు. ఎప్పటికప్పుడు కాషాయ శిబిరంలో చేరికల జాతర ఉంటుందని భావించినా.. ఆ ఛాయలు కనిపించడం లేదు. బీజేపీ నాయకులు ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాషాయ కండువా కప్పుకోవాలని ఆహ్వానిస్తున్నా ఆసక్తి చూపించడం…