Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Congress Mlc Jeevan Reddy Episode

Off The Record: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలక ఎపిసోడ్‌ ముగిసినట్టేనా? డిమాండ్స్ ఏంటి? హైకమాండ్ భరోసా ఏంటి?

NTV Telugu Twitter
Published Date :June 27, 2024 , 9:50 pm
By Sudhakar Ravula
  • తెలంగాణ కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ ముగిసిందా..?
  • ఇరకాటంలో పెట్టిన ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీకి..
  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ని చేర్చుకోవడంపై అలకబూనిన జీవన్‌రెడ్డి..
  • ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధమైన జీవన్ రెడ్డి..
  • ఢిల్లీ పెద్దల మంత్రాంగంతో చివరికి కూల్‌..
Off The Record: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలక ఎపిసోడ్‌ ముగిసినట్టేనా? డిమాండ్స్ ఏంటి? హైకమాండ్ భరోసా ఏంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: గడిచిన మూడు వారాలుగా తెలంగాణ కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ నలుగుతోంది. పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పెట్టిన ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీకి మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ని చేర్చుకోవడంపై అలకబూనిన జీవన్‌రెడ్డి ఒక దశలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్‌ అగ్ర నేతలంతా రంగంలోకి దిగి ఆయన్ని బుజ్జగించాల్సి వచ్చిందట. ఢిల్లీ పెద్దల మంత్రాంగంతో చివరికి కూల్‌ అయ్యారు జీవన్‌రెడ్డి. వాళ్ళు ఇచ్చిన హామీలకు ఓకే చెప్పేశారాయన. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా ఉ్ననా… తనకు కనీసం గౌరవం కూడా లేకుండా చేశారంటూ ఆవేదన చెందిన ఎమ్మెల్సీ.. రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికి కాస్త మెత్తబడ్డా.. వ్యవహారం పూర్తిగా కొలిక్కి రాకపోవడంతో సీన్‌ ఢిల్లీకి మారింది.

Read Also: SS Rajamouli on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై ప్రశంసలు కురిపించిన దర్శకధీరుడు

ఇతర.. పార్టీ పెద్దలతో పాటు అక్కడే ఉన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ దీపా దాస్‌మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డితో ఢిల్లీలో భేటీ అయ్యారు జీవన్‌. ఆ చర్చల తర్వాతే శాంతించారట ఆయన. వీళ్ళిద్దరితో పాటు కేసీ వేణుగోపాల్‌ కూడా చర్చల్లో పాల్గొని జీవన్ రెడ్డికి భవిష్యత్ రాజకీయంపై భరోసా ఇచ్చినట్టు సమాచారం. అయితే.. పార్టీ నాయకత్వం తనను అవమానించిందని రెండు మూడు రోజులుగా జీవన్‌రెడ్డి వాయిస్ వినిపిస్తున్న క్రమంలో.. పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ మీడియా సమక్షంలోనే వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్‌ చేరిక విషయంలో సమన్వయ లోపం ఉన్న మాట వాస్తవమమేనని అంగీకరించారాయన. ఇక అధిష్టానం ఆయనకు సముచిత గౌరవం ఇస్తుందని, సమయం.. సందర్భాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు సీఎం.. ఈ క్రమంలో మరో వాదన కూడా వినిపిస్తోంది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

జీవన్‌రెడ్డి కేబినెట్‌ బెర్త్‌ ఆశిస్తున్నారన్నది దాని సారాంశం. అయితే.. సామాజిక సమీకరణాల కోణంలో అది కుదురుతుందా..? అన్న డౌట్స్‌ కూడా వెంటనే వస్తున్నాయి. మంత్రి పదవి సంగతి తర్వాత ప్రస్తుతానికైతే… ఆయనకు ఒక విషయంలో గట్టి హామీ వచ్చినట్టు తెలిసింది. ఇప్పుడున్న ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన వెంటనే… తిరిగి ఛాన్స్‌ ఇస్తామని, కంటిన్యూ చేస్తామని కాంగ్రెస్‌ పెద్దలు భరోసా ఇచ్చినట్టు సమాచారం. గవర్నర్ కోటాలో జీవన్ రెడ్డి ని మండలికి పంపే అంశంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే… రైతు రుణమాఫీ లాంటి అంశాలపై కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది కాంగ్రెస్‌ సర్కార్‌. అలాంటి బాధ్యత ఏదో ఒకటి ఆయనకు ఇవ్వవచ్చంటున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్‌కు కంట్లో నలుసులా మారిన జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌కు ఇక తెరపడినట్టేనన్నది పార్టీ వర్గాల ఫీలింగ్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • CM Revanth Reddy
  • congress
  • mlc jeevan reddy
  • off the record

తాజావార్తలు

  • Air India Plane Crash: ‘‘ఫ్యూయల్ ఫిల్టర్ జామ్’’..ఎయిరిండియా ప్రమాదానికి ప్రాథమిక కారణం.!

  • Heavy Rain: హైదరాబాద్లో మొదలైన వర్షం.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

  • Plane Crash: భర్త పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం లండన్ వెళుతూ.. అనంతలోకాలకు..

  • Chirla Jaggireddy: అవినీతి గిన్నిస్ బుక్‌లో వారి పేర్లు కచ్చితంగా ఉంటాయి..!

  • END vs ENG: రవీంద్ర జడేజా ఓ జట్టులో.. కుల్దీప్ యాదవ్‌ మరో జట్టులో!

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions