ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… సాదరంగా ఆహ్వానించి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది.. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తున్నానును అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్.. కాగా, ఇవాళ ఒడిశా సచివాలయంలో ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో సీఎం వైఎస్ జగన్ సమావేశమైన సంగతి తెలిసిందే.. ఈ భేటీలో మూడు అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమావేశం ముగిసింది.. ఒడిశా సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ భేటీలో ముఖ్యంగా మూడు అంశాలపై చర్చించారు.. ఇక, రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కానుంది.. ఒడిశా అభ్యంతరాలతో సుదీర్ఘంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చ సాగగా.. సీఎం వైఎస్ జగన్‌తో పాటు…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్రం ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించనున్నారు. కొఠియా గ్రామాలతోపాటు, నేరడి బ్యారేజీపై చర్చించనున్నారు. శ్రీకాకుళం, ఒడిశాలో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్ బయలుదేరతారు. సాయంత్రం 5…
ఆపరేషన్ పరివర్తన్ కింద 800 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మ ఆట్లాడారు. గంజాయి సాగును అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ఈ ఆపరేషన్‌లో 80 టీమ్‌లు పాల్గొన్నాయని, గంజాయి సాగును ధ్వంసం చేయకుండా గిరిజనులు ప్రతిఘటిస్తున్న సంఘటనలు తక్కవగా చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలి పారు. గంజాయి సాగును ధ్వంసం చేయడానికి చాలా మంది గిరిజ నులే స్వచ్ఛంధంగా…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 9న భువనేశ్వర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇక ఈ భేటీ లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం గురించి చర్చించనున్నారు సీఎం జగన్. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారు. చాలా రోజులుగా పోలవరంపై…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు భువనేశ్వర్‌లో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన స్టూడెంట్స్ విభాగం నేతలు కోడి గుడ్లతో దాడి చేశారు. ఆయన భువనేశ్వర్ నుంచి కటక్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంత్రి కాన్వాయ్‌ను ముందుకు వెళ్లకుండా విద్యార్థి నాయకులు నల్ల బ్యాడ్జీలను ప్రదర్శించి అడ్డుకున్నారు. లఖింపుర్‌ఖేరి హింసాత్మక ఘటనలో అజయ్ మిశ్రా కొడుకు, ఆశిష్ మిశ్రా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆశిష్ మిశ్రాపై రైతుల పైకి…
బ్రిటీషర్లు భారత దేశాన్ని పరిపాలించే రోజుల్లో అనేక రకాలైన పన్నులు విధించేవారు. ఆ పన్నులు మరీ దారుణంగా, సామాన్యులు భరించలేనంతగా ఉండేవి. సామాన్యులతో పాటుగా వ్యాపారులు సైతం ఆ పన్నులకు భయపడిపోయేవారు. కాని, తప్పనిసరి పరిస్థితుల్లో పన్నులకు ఒప్పుకోవాల్సి వచ్చేది. తొలి స్వాతంత్య్ర సగ్రామం సమయంలో మన దేశంలో గుజరాత్ ప్రాంతంలోని కచ్‌లోనూ, ఒడిశా ప్రాంతంలోనూ అధికంగా ఉప్పు ఉత్పత్తి అయ్యేది. అయితే, ఈ ఉప్పుపై పెద్ద ఎత్తున బ్రిటీషర్లు పన్నును వేసేవారు. ఈ పన్నులకు…
భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.. మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ.. కీలక ఎన్నిక ఎదుర్కోబోతున్నారు. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడినప్పటికీ.. మమతా బెనర్జీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆరునెలల్లోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఇందుకోసం భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో మమత పోటీ చేస్తున్నారు. 2011, 2016 ఎన్నికల్లో…
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మర్డర్ కేసులో కీలక నిందితుడైన మావోయిస్టు కమాండర్‌ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్తరాసిచెట్లకు చెట్లకు చెందిన దుబాసి శంకర్ అలియాస్ రమేశ్‌ను అరెస్ట్ చేశారు ఒడిశా పోలీసులు. రెండు రోజుల కిందట పేటగూడ, నౌరా గ్రామాల అటవీ ప్రాంతంలో DVF, NOG, BSF సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రమేశ్ పట్టుబడ్డాడు. సోమవారం ఉదయం నిర్వహించిన కార్డాన్ సెర్చ్‌లో.. హార్డ్‌కోర్ మావోయిస్ట్ దుబాసి…
ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే గేమ్ ఫుట్‌బాల్. యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఈ క్రీడలకు మంచి ప్రాచుర్యం ఉన్నది. మనదేశంలో కూడా ఈ గేమ్‌కు ఆదరణ ఉన్నా, దానికి తగిన మౌళిక సదుపాయాలు, శిక్షణ లేకపోవడంతో కొంత వెనకబడి ఉన్నది. అయితే, కొన్ని ప్రాంతాల్లో పిల్లలు గల్లీగ్లలీల్లో ఆ ఫుట్‌బాల్ గేమ్ ఆడుతుంటారు. ఒడిశాలోని సబరంగ్పూర్ జిల్లాలోని సుకీగావ్ అనే గ్రామంలో పిల్లలు ఫుట్‌బాల్ గేమ్ అడుతుండగా పక్కనే ఉన్న అడవిలోనుంచి రెండు ఎలుగు…