నేడు సీఎం జగన్ ఒడిశా పర్యటన…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్రం ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించనున్నారు. కొఠియా గ్రామాలతోపాటు, నేరడి బ్యారేజీపై చర్చించనున్నారు. శ్రీకాకుళం, ఒడిశాలో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం పాతపట్నం చేరుకుని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు.
శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్ బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో.. రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఒడిశా సీఎంతో చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను సీఎం జగన్.. నవీన్ పట్నాయక్‌కు వివరించనున్నారు.
Also Read
- Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 56 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని చెప్పనున్నారు. జంఝావతి ప్రాజెక్టు వల్ల 24,640 ఎకరాల్లో సాగునీరు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని, ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని వివరించనున్నారు. అలాగే 21 కొఠియా గ్రామాల్లో 16..ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని నవీన్ పట్నాయక్‌కు వివరించనున్నారు జగన్మోహన్ రెడ్డి.
- Tags
- Andhra Pradesh
- cm jagan
- Odisha
తాజావార్తలు
-
Asaduddin Owaisi : రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి.. కాంగ్రెస్‌కు కాదు, రేవంత్‌కే నా సపోర్ట్
-
Tamil Nadu: విడాకుల సందర్భంగా భార్య ‘కుక్క’తో పోలిక.. ధర్మాసనం తీరుపై విమర్శలు
-
Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
-
Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!