కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన కేంద్రం.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ విషయంలో బాధ్యత రాష్ట్రాలకే వదిలేసింది.. అయితే, కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలనే డిమాండ్ రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది.. ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వినిపించగా.. ఇవాళ వారికి ఒడిషా తోడైంది.. కేంద్రమే వ్యాక్సిన్లు పంపిణీ…
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగానే వుంది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణను చేర్చాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. బీజేడీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఈ విషయంపై తీర్మానాన్ని ఆమోదించారు. తరచూ తుపానులు, మహమ్మారి…
బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ బాలాసోర్ వద్ద తీరం దాటింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఒడిశా తీరప్రాంతం మొత్తం అతలాకుతలం అయింది. ఒడిశాలోని 9 జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా భద్రక్ జిల్లాపై పడింది. భద్రక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ వేగంతో గాలులు వీస్తుండటంతో చెట్లు విరిగి పడుతున్నాయి. ఇక సముద్రంలోని అలలు ఎగసి పడుతున్నాయి. ఇక బాలేశ్వర్‌లోని చాందిపూర్ లో…
ఒరిస్సా, బెంగాల్ తీరంపై విరుచుకుపడుతుంది అతి తీవ్ర తుఫాన్ ‘యాస్’. ధమ్ర పోర్ట్ కు సమీపంలో తీరాన్ని తాకిన అతి తీవ్ర తుఫాన్… మధ్యాహ్నం తర్వాత బాలాసోర్-ధమ్ర పోర్ట్ మధ్య తీరం దాటనుంది అతితీవ్ర తుఫాన్. 9 ఒడిషాజిల్లాలపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే అక్కడ రెడ్ వార్నింగ్ జారీ చేసింది ఐఎండీ. ఈ తుఫాన్ కారణంగా బెంగాల్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ధమ్ర పోర్ట్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక…
బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ యాస్ ఒడిశాతీరం వైపు దూసుకొస్తున్నది. 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ ఒడిశాలోని చాంద్‌బలి-దామ్ర పోర్ట్ కు సమీపంలో తీరం దాటనున్నది. ప్రస్తుతం పారాదీప్‌కు 90 కి.మీ, బాలాసోర్‌కు 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు మధ్యాహ్నం వరకు తుఫాన్ తీరం దాటనున్నది. యాస్ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 165 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలోని అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ…
రేపు సంపూర్ణ చంద్రగ్రహం ఏర్పడనుంది… భారత్‌లో మాత్రం పాక్షికంగా ఉండబోతోంది.. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుండగా… భారత్‌లో కొన్ని ప్రాంతాలకే ఇది పరిమితం కానుంది… పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, ఒడిషా తీర ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులలో కనిపిస్తుందని ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) వెల్లడించింది. సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్‌లో మధ్యాహ్నం…
యాస్ తుఫాన్.. తీవ్ర తుఫాన్‌గా మారుతుండడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. తుఫాన్ ప్రభావం భారీగా ఉండే ప్రాంతాల్లో ముందుగానే అలర్ట్ అయ్యారు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఎన్డీఆర్ఎఫ్.. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌లోని 14 జిల్లాల పరిధిలో 8,09,830 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.. యాస్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. ఇక, యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. 11…