ఆపరేషన్ పరివర్తన్ కింద 800 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మ ఆట్లాడారు. గంజాయి సాగును అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ఈ ఆపరేషన్లో 80 టీమ్‌లు పాల్గొన్నాయని, గంజాయి సాగును ధ్వంసం చేయకుండా గిరిజనులు ప్రతిఘటిస్తున్న సంఘటనలు తక్కవగా చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలి పారు. గంజాయి సాగును ధ్వంసం చేయడానికి చాలా మంది గిరిజ నులే స్వచ్ఛంధంగా ముందుకు వస్తున్నారన్నారు. 150 ఎకరాల్లో గంజాయి పంటని గిరిజనులే స్వయంగా ధ్వంసం చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
ఏవోబీలోనే ఈ సమస్య అధికంగా ఉందని ఆయన వెల్లడించారు. ఏపీ-ఒడిస్సాల్లో కలిపి మొత్తంగా ఎమిమిది జిల్లాల్లో గంజాయి సమస్య ప్రధానంగా ఉందన్నారు. రాష్ట్రాల సమమన్వయంతో పాటు ఇతర ఎన్ఫోర్సెమెంట్ విభాగాలతో కూడా కో ఆర్డినేట్ చేసుకుంటున్నా మ న్నారు. గంజాయి సాగు, సరఫరా వెనుక గిరిజనులను అడ్డం పెట్టు కుని ఏదైనా పెద్ద నెట్ వర్క్ ఉందా.. అనే కోణంలోనూ విచారణను చేపట్టామని ఆయన వెల్లడించారు. గంజాయి సాగు సమస్యను శాంతి భద్రతల అంశంగా కాకుండా ఆర్థిక-సామాజిక సమస్యగానే చూస్తు న్నామని ఆయన తెలిపారు. గిరిజనులకు ఉపాధి కల్పించేలా ప్రభు త్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. గంజాయితో పాటు హెరా యిన్ వంటి ఇతర డ్రగ్స్ సమస్యల పైనా ఎస్ఈబీ ఫోకస్ పెట్టిందని ఈ సందర్భంగా వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు.