Rohit Sharma on ICC World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశం భారత జట్టుకు తృటిలో చేజారింది. దాంతో టీమిండియా క్రికెటర్స్ అందరూ ఫైనల్ ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పటికే పలుమార్లు ప్రపంచకప్…