జీఎస్టీ రేట్ల తగ్గింపు పండుగ సీజన్‌లో భారత ఆటోమొబైల్ మార్కెట్ కు కొత్త ఊపు తెచ్చింది. అక్టోబర్‌లో కంపెనీలు అనూహ్యంగా మంచి పనితీరును కనబరిచాయి. దేశంలో 5.2 లక్షలకు పైగా కార్లను విక్రయించాయి. మారుతి 242,096 వాహనాలను విక్రయించింది, గత సంవత్సరంతో పోలిస్తే 20% పెరుగుదల. నవరాత్రితో ప్రారంభమైన 40 రోజుల పండుగ సీజన్‌లో, 500,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. వాటిలో 4.1 లక్షల కార్లు డెలివరీ చేశారు. మహీంద్రా & మహీంద్రా తన అత్యధిక…
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ను ప్రకటించింది. పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీకి ఈ నెల (అక్టోబర్)లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు లభించింది. అలాగే.. మహిళల విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ అమేలియా కెర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది.
తయారీ రంగంలో గొప్పగా చెప్పుకునే చైనా ఇప్పుడు ఇందులో చాలా వెనుకబడిపోయింది. ఒకవైపు చైనా ఆర్థిక వృద్ధి చాలా నెమ్మదిగా ఉండగా.. భారత్‌కు శుభవార్త అందింది. హెచ్‌ఎస్‌డీసీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్ యొక్క తయారీ రంగం అక్టోబర్‌లో విస్తరించింది. ఈ విషయంలో భారత్ చైనాను అధికమించిందని నివేదిక తెలిపింది. ఈ పెరుగుదలకు కారణం విదేశాల్లో భారత్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కొత్త ఆర్డర్‌లను అందుకోవడమే కాకుండా…
అక్టోబర్ నెలలో వేడిని అనుభవించారా..? 2024 అక్టోబర్ దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నెలగా నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం.. గతంలో 1951 అక్టోబర్‌లో చాలా వేడిగా ఉన్నట్లు నమోదు కాగా.. తాజాగా 120 ఏళ్ల తర్వాత మళ్లీ చోటు చేసుకుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో మధ్య భారతదేశంలోని (మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్)లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. అంతేకాకుండా.. ఢిల్లీ NCR సహా ఉత్తర-పశ్చిమ భారతదేశంలో కూడా అక్టోబర్ నెలలో ఎక్కువ వేడి నమోదైంది.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అక్టోబర్ రెండో వారంలో భారత్‌లో పర్యటిస్తున్నారు. మాల్దీవుల అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రధాని మోడీతో చర్చించనున్నట్లుగా వెల్లడించాయి.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. భక్తుల రద్దీతో శ్రీవారి దర్శనానికి గంటల పాటు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా టీటీడీ కొన్ని ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తూ ఉంటుంది. దర్శన టికెట్లతో పాటు ఆర్జిత సేవలు, వసతి గదులు ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 31 వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. మహిళలు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు ఈ యాప్ దాని గోప్యత, భద్రత కోసం ప్రతి ఒక్కరి మొదటి ఎంపికగా ఉంది.
అత్యల్ప వర్షపాతం కారణంగా చెరకు దిగుబడి తగ్గిన కారణంగా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే తదుపరి సీజన్‌లో చక్కెర ఎగుమతులను భారతదేశం నిషేధించవచ్చని తెలుస్తోంది. వర్షపాతం తగినంత లేకపోవడంతో ఈ సారి చెరకు దిగుబడి తగ్గనుండడంతో చెరకు ధరలకు రెక్కలు వస్తాయని సర్కారు అంచనా వేస్తోంది.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జనసేన పార్టీ అభిప్రాయపడుతోంది. వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోంది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అక్టోబర్ నుంచి ఆయన బస్సు యాత్రను ప్రారంభిస్తారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర…