వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక్కసారి వార్తల్లో నిలిచారు బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో.. పార్టీ పదవి నుంచి ఆమెను బీజేపీ తప్పించిన విషయం తెలిసిందే.. ఇక, సుప్రీంకోర్టు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా దుమారమే రేగింది.. ఈ వ్యవహారంలో ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి భారత్‌పై, బీజేపీపై, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.. ఇదే…
మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు! దేశంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగుతున్నాయి. ముస్లిం దేశాలు సైతం ఈ వ్యవహారంపై మండిపడ్డాయి. అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ అయితే.. దేశంలో కొన్ని చోట్ల ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని, ప్రవక్తపై కామెంట్స్ చేసిన వారిని హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు.. నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసినా, ఆమెపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే…
ఓ టీవీ డిబెట్ లో పాల్గొంటూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశంలో, విదేశాల్లో దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే ఖతార్, యూఏఈ, సౌదీ, మలేషియా, ఇరాక్ వంటి దేశాలు భారత్ కు తమ నిరసన తెలిపాయి. భారత విదేశాంగ శాఖ కూడా అంతే స్థాయిలో బదులిచ్చింది. ఇప్పటికే మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని.. వ్యక్తులు చేసిన…
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అల్లర్లకు తెరలేపాయి. అంతేకాదు.. ఇస్లామిక్ దేశాలు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం దోహాలోని భారత రాయబారికి సమన్లు జారీ చేసింది కూడా! నుపుర్‌తో పాటు ట్విటర్ మాధ్యమంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ జిందాల్‌పై పార్టీ వేటు వేసినప్పటికీ.. ఆ లోపే…